Horoscope today మేష రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఒక వార్త మీకు సంతోషం కలిగిస్తుంది. కొన్ని పనులు ఉత్సాహ పరుస్తాయి. కనకధారాస్తవం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం అయ్యే అవకాశముంది. శివ అష్టోత్తర శత నామావళి పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల మేలు కలుగుతుంది.
కర్కాటక రాశి వారికి చేపట్టే పనుల్లో విజయాలు సాధిస్తారు. కార్యానుకూలత ఉంటుంది. అధికారులతో సంబంధాలు బాగుంటాయి. శ్రీరామ నామం జపించడం ఉత్తమం.
సింహ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల్లో లాభాలుంటాయి. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.
కన్య రాశి వారికి సహాయాలు అందుకుంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినా పనులు పూర్తవుతాయి. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
వ్రశ్చిక రాశి వారికి ఉత్సాహంగా ముందుకు వెళతారు. ప్రతి విషయాన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. లక్ష్మీ సహస్ర నామం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి ధర్మబద్ధంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. సూర్యనారాయణ మూర్తిని పూజిస్తే మంచిది.
మకర రాశి వారికి పట్టుదలతో పనులు చేస్తారు. కొందరి ప్రవర్తన మీకు విసుగు పుట్టిస్తుంది. అకారణంగా గొడవలు జరిగే అవకాశముంది. ఇష్టదేవత దర్శనం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి సంతోషంగా గడుపుతారు. చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్ర నామాలు చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బుద్ధి బలం పెరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల మంచి జరుగుతుంది.