Wife & Husband : యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి భార్య సెల్ఫీ భర్త ను బలి చేసింది. ఇంతకు ఆమె చేసిందేమిటో తెలుసా.. బెడ్ పై రూ. 500 నోట్లతో సెల్ఫీ దిగడమే.. ఆ కరెన్సీ మొత్తం రూ. 14లక్షలు.. దీంతో యూపీ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖలో కలకలం రేపింది.
యూపీలోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ చంద్ర సహాని. ఇటీవల సహాని భార్య, అతని పిల్లలు వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీతో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే అదికాస్త వైరల్ అయ్యింది. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో, రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు సహానిపై విచారణకు జరిపారు. సదరు ఎస్ ఐని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేశారు.
ఆ డబ్బు ఆస్తి విక్రయిస్తే వచ్చింది..
రూ. 14 లక్షల విలువైన కరెన్సీని బెడ్‌పై పెట్టి.. ఆ నోట్ల కట్టల పక్కన సహానీ భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని సెల్ఫీ తీసుకున్నారు. ఇక, ఈ ఫొటోపై ఎస్‌ఐ సహాని వివరణ ఇచ్చారు. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నదని చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనపై పోలీసు అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. రమేష్ చంద్ర సహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నది నిజమే. ఎస్ఐ భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ చేపట్టాం. ఆ ఫోటోలో ఎస్ఐ భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారి ని బదిలీ చేశాం. అతనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు. పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.
ReplyForward
|