అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠనిన్న మధ్యాహ్నము 12:29 – 12:30 సమయా నికి జరిగిన విషయం మనందరకూ తెలిసిన విషయ మే కదా! అయితే, ఆ ముహూర్తం సరియైనదేనా? పుష్యమాసంలో ప్రతిష్ఠ చేయవచ్చునా ? ఇటువంటి సందేహాలు చాలామంది లేవనెత్తారు అందువలన వివరంగా పరిశీలన చేద్దాం.
1. *అసలు పుష్యమాసంలో_ప్రతిష్ఠ_సరియైనదేనా?*
సమాధానం : – నిస్సందేహముగా సరియైనదే
దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం పనికి వస్తుందని జ్యోతిష గ్రంథాలలో ఉన్నదే.
” సర్వేషాం_పౌషమాఘౌ_ద్వౌ_విబుధస్థాపనే_శుభౌ ” – అని బృహస్పతి తెలిపినదే. అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థము. పైగా, ఒక్కొక్క మాసంలోని ప్రతిష్ఠ కు ఫలితాలను కూడా తెలుపుతూ . . . పౌషే_రాజ్యవివృద్ధిస్యాత్ …. అని కూడా తెలియజేయడం జరిగింది. దీనర్థమేమంటే… “పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి ని పొందుతుంది”.
మనతెలుగు రాష్ట్రాలలో పుష్యమాసం అంటే శూన్య మాసం అని తలుస్తాము. అయితే, సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశిస్తే పుష్యమాసం వివాహం, గృహారంభ- ప్రవేశాదులకు పనికి వస్తుందని ముహూర్త గ్రంథాలలో స్పష్టంగా ఉంది. మకర స్థే_సూర్యే_పౌషే_శుభమ్ అని అంటూ నిషేధస్తు_ధనురర్కవిషయః అని పీయూషధా రయందు స్పష్టపరచటం జరిగింది.
2. *తిథులలో ద్వాదశి తప్ప ఇంకేమీ దొరకలేదా ?*
సమాధానం : ద్వాదశీ తిథికి అధిపతి విష్ణుభగవానుడు.
యద్దినే_యస్యదేవస్య_తద్దినే_తస్యసంస్థితిః” – అని నారదమహర్షి వాక్యము. అందువలన విష్ణు భగవానుని అవతారమైన శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ కు ద్వాదశి ని మించిన తిథి ఏమున్నది? ద్వాదశ్యాం_హరేశ్చ….. అని అగ్నిపురాణమందు కూడా ఉన్నది.
3. *ప్రతిష్ఠ మిట్టమధ్యాహ్నం చేయడమేమిటి ?*
సమాధానం: అభిజిత్ – ముహూర్తంలో ఏమి చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణ వచనం.
అంతేకాక, శతృనిర్మూలనం కూడా జరిగి తీరుతుంది.
4. *శుభముహూర్తమేనా? గ్రహస్థితి బాగుందా? చరలగ్నంలో ప్రతిష్ఠ ఏమిటి?*
సమాధానం : ముహూర్తం బాగుంది. లగ్నంలో గురుడున్నాడు. ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్నబలాన్ని కలిగి ఉంది. స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలం కలిగి లేవు. మేషం చరలగ్నమైనా, నవాంశ లో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది.
లగ్నే_స్థిరే_చోభయరాశియుక్తే
నవాంశకే_చోభయగే_స్థిరే_వా …. అని వసిష్ఠ సంహిత.
పైగా లగ్నంనుండి ద్వితీయభావమందు రాశియందు కాదని గమనించండి) చంద్రుడు ఉండటం ఎంతశుభ ప్రదమో వింశోపకబలం తెలిసినవారికి సులువుగా అవగతమౌతుంది. దీనివలన రాబోయే కాలంలో దేశమంతటా రామమందిరాలు నెలకొని, దేశం శుభపరిణామాలు చవిచూస్తుందని వసిష్ఠమహర్షి వచనం
లగ్నాద్ద్వితీయే శుభఖేచరేంద్రాశ్చంద్రాశ్చ పుత్రార్థశుభప్రదాస్స్యుః..
అందువలన ముహూర్త విషయం లో ఎట్టి సందేహాలు లేవు.ఇది అన్నదానం చిదంబర శాస్త్రి గారు పంపిన వివరణ. వారే 9సంవత్సరములు యంత్రం అనుష్ఠా నం చేసి ప్రతిష్ట కు అందచేశారు.