Payal Rajput
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎవరినీ వదలట్లేదు. చిన్న హీరోయిన్ల దగ్గరి నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అందరూ దీనికి బాధితులుగానే ఉంటున్నారు. గతంలో దీనిపై పెద్దగా ఎవరూ స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు మీటూ ఉద్యమం తర్వాత మాత్రం స్టార్ హీరోయిన్లు కూడా తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటూ వస్తున్నారు.
తాజాగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా దీనిపై కామెంట్లు చేసింది. ఆమె ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎక్కువగా ఆమె బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తూ వస్తోంది. రవితేజ, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించినా పెద్దగా కలిసి రాలేదు.
అయితే ఇప్పుడు ఆమె మంగళవారం అనే సినిమాలో బోల్డ్ పాత్రలోనే నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న వేయగా.. దానిపై స్పందించింది. కాస్టింగ్ కౌచ్ ను నేను కూడా స్వయంగా ఎదుర్కున్నాను. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత చాలామంది ఇలాంటివే మాట్లాడారు.
వారితో సెక్స్ చేస్తే పెద్ద సినిమాల్లో ఛాన్సలు ఇస్తామని చెప్పారు. చాలామంది ఇలాంటి ఆఫర్లే చేశారు. కానీ నేను వాటికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే వాటిని రిజెక్ట్ చేశాను. నా ట్యాలెంట్ కు వచ్చిన ఛాన్సుల తోనే ఇక్కడి వరకు వచ్చాను. సినిమా ఇండస్ట్రీలోనే కాదు చాలా రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది. మనం ధైర్యంతో దాన్ని తిరస్కరించాలి. అంతే తప్ప దానికి లొంగిపోవద్దు అంటూ కామెంట్లు చేసింది పాయల్.