33.6 C
India
Monday, May 20, 2024
More

    India Vs England : తొలిరోజు ఆటకు భారత్ ఎన్ని పరుగులు రాబట్టిందో తెలుసా?  

    Date:

    India Vs England
    India Vs England

    India Vs England 2nd Test Match : విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. తొలిరోజు భారత్ ఆట ముగిసింది. ఓపెనర్ జైశ్వాల్ 179తో క్రీజులో ఉన్నాడు. (256 బంతుల్లో 17 ఫోర్టు 5 సిక్సులు) భారీ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మొదటి రోజు ఆట ముగిసే వేళకు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ (5) నిలిచాడు.

    ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ (14) పరుగులకే బషీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన యశస్వి తరువాత పుంజుకున్నాడు. రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు 40 పరుగులు రాబట్టాడు. శుభ్ మన్ గిల్ (34) తో రెండో వికెట్ కు 49 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ (27)తో మూడో వికెట్ కు 90 రాబట్టుకున్నారు.

    స్పిన్నర్లు, పేసర్లు ఎంత కష్టపెట్టినా అవకాశం ఇవ్వకుండా పరుగులు పిండుకున్నారు. 151 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన జైశ్వాల్ తరువాత దూకుడుగా ఆడాడు. ఆట కొద్దిసేపటికి ముగుస్తుందనగా శ్రీకర్ భరత్ (17)ను రెహాన్ ఔట్ చేశాడు. ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించి బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద దొరికిపోయాడు.

    ఇలా మొదటి రోజు ఆట సాగింది. దీంతో రెండో రోజు ఆట ఎలా సాగుతుందో తెలియడం లేదు. మన చేతిలో వికెట్లు తక్కువగానే ఉన్నాయి. పరుగులు చేయాల్సింది ఎక్కువ ఉన్నాయి. ఈనేపథ్యంలో మన ఆటగాళ్ల ప్రతిభ ఏ మేరకు ఉపయోగించుకుని నిలబడతారో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ ఆటగాళ్ల ఆట తీరు ఎలా ఉంటుందో రేపు చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India Vs England : ఐదో టెస్టుల్లో ఇంగ్లాండ్ పై విజయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ అగ్రస్థానం పదిలం.

    India Vs England : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన ఐదు టెస్ట్...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Jaiswal Century : జైస్వాల్ మెరుపు సెంచరీ

    Jaiswal Century : రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో...

    Team India : టీమిండియా నిర్ణయంతో విమర్శల వెల్లువ

    Team India : టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఏడు టెస్టుల సిరీస్...