- రసవత్తరంగా సాగుతున్న సీజన్ 2023

IPL 2023 Indian players are top : ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతున్నది. టోర్నీలో ఆయా జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. అకాశమే హద్దుగా ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. కొన్ని వివాదాలు ఎదురవుతున్నా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. ఈ సారి విజేత ఎవరో మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఇప్పటికయితే బ్యాటింగ్, బౌలింగ్ లో మనోళ్లే ముందు వరుసలో నిలిచారు. ప్రతిభకు పట్టం కట్టేలా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఎందరినో ప్రపంచానికి పరిచయం చేస్తున్నది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్లో అభిమానుల్లో సంతోషం, క్రీడోత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్న ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్ లో మనోళ్లే ముందుండడం విశేషం
వికెట్లను గిరాటేస్తున్న చాహల్..
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న చాహల్ ఈసారి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచారు. టీమిండియాకు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఈ మ్యాచ్తో ఈ ఫీట్ ను సాధించాడు. 187 వికెట్లతో యజువేంద్ర చాహల్ ముందువరుసలో నిలవగా, 183 తో బ్రావో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పీయూష్, అమిత్, అశ్విన్ తర్వాతి వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. చాహల్ గతంలో ముంబై, బెంగళూరు తరఫున ఆడాడు. అయితే గత సీజన్లో కూడా ఎక్కువ వికెట్లు తీసి పర్చుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సారి చాహలే ముందంజలో ఉండడం విశేషం
బ్యాటింగ్లో మెరిసిన కోహ్లీ..
టీమిండియా అగ్రశ్రేణి ఆటగాడు కోహ్లి ఈసారి ఐపీఎల్ లో నంబర్ 1 ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అత్యధిక పరుగులు తీసిన ఆటగాడిగా ముందు వరుసులో నిల్చున్నాడు. అయితే బౌలింగ్, బ్యాటింగ్ లలో మనోళ్లే ముందు వరుసలో ఉండడంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నది.