Bhola Shankar మెగాస్టార్ చిరంజీవి తమన్నా జంటగా నటించిన సినిమా భోళా శంకర్ సినిమా ఈనెల 11న రాబోతోంది. కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటించింది. దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్ లో అనిల్ సుంకర నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా భోళాశంకర్.
సినిమాలో డజన్ కు పై కమెడియన్లు నటిస్తున్నారు. దీంతో కామెడీకి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నైజాంలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ కు స్పందన కనిపిస్తోంది. మిగతా చోట్ల కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యూకేలో 67 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటివరకు 5500 టికెట్లు అమ్ముడైపోయాయి. ప్రీమియర్లకు 45 కె పౌండ్స్ వసూలయ్యాయి. యూకేలో రూ.44 లక్షలు వసూలు కావడం గమనార్హం. అమెరికాలో భోళా శంకర్ ప్రీమియర్ షోకు స్పందన కనిపిస్తోంది. 326 లొకేషన్లలో 885 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. 200కె డాలర్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో భోళా శంకర్ కు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ లో 50 శాతం ఆక్యుపెన్సీని అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధించింది. హైదరాబాద్ లోనే రూ. 1.64 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి. భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్ నెమ్మదిగా వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా రూ.15 కోట్లు వసూలు చేసింది. వీరసింహా రెడ్డి కూడా రూ. 15 కోట్లు సాధించింది. బ్రో సినిమా రూ. 14 కోట్లు, దసరా రూ. 11 కోట్లు సాధించగా భోళాశంకర్ రూ. 5 కోట్లే సాధించింది.