38.7 C
India
Saturday, May 18, 2024
More

    Jagan Self Goal : జగన్ స్వయంకృతాపరాధం.. ఏపీలో మారతున్న సమీకరణాలు

    Date:

    Jagan Self Goal
    Jagan Self Goal

    Jagan Self Goal : ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రజలు ఏదైతే ఆశించారో , అది జరగలేదనేది కనిపిస్తున్న దశ్యమే. ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు అవతలి వారిపై కుట్రలు చేసే క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అడ్డంగా బుక్కవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏపీలో ప్రత్యామ్నాయం ఆలోచించే ఏకైక వ్యక్తి చంద్రబాబు. రాష్ర్ట  అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతుంది అంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమనే అభిప్రాయం ఇప్పుడు అందరిలో కనిపిస్తున్నది.

    అయితే గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు జగన్ ను దోషిగా తేలుస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచాక పరదాలు, భారీకేడ్ల చాటున తిరుగుతున్న ఏపీ సీఎం జగన్ , ప్రజల్లోనే ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇలాంటి చర్యలు చేపట్టడం నిజానికి జగన్ చేసుకున్న స్వయంకృతాపరాధమే. ఏపీలో ప్రస్తుతం ప్రజల మూడ్ మారుతున్నది. సంక్షేమ పథకాలు అందుతున్నా సరే, రాష్ర్టంలో నిలిచిన అభివృద్ధి పనులు, వైసీపీ నేతల ఆగడాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎలాగూ ఈ సంక్షేమ పథకాలు టీడీపీ అయినా అమలు చేస్తున్నది. కానీ సీనియర్ నేతగా, అనుభవం ఉన్న లీడర్ గా చంద్రబాబుకు అభివృధ్ధి, పరిశ్రమలు తీసుకురావడంతో ఆయనకు మరెవరూ సాటిరారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబును పసలేని కేసులతో ఇబ్బంది పెడుతున్నది.

    అయితే మొదట స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ తెరపైకి తెచ్చారు. అభియోగాలు మోపి, ఆధారాలు చూపించకుండా కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ ఖైదీగా చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపించింది.   ఇక్క అక్కడితే జగన్ సంతోషం ఆగలేదు. ఇక వరుస కేసులు నమోదు చేస్తూ వెళ్తున్నాడు. అంగళ్లు, ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు, ఇసుక, మద్యం ఇలా తోచిందల్లా చంద్రబాబు మీద పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రజల్లో, న్యాయవ్యవస్ధలో ఆలోచనకు కారణమైంది.

    రాష్ట్రంలోనే సీనియర్ నేతగా, 74 ఏండ్ల చంద్రబాబుపై మరీ ఇంత కక్ష ఎందుకనే విషయాన్ని ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు ఆలోచన మారడమే కారణంగా తెలుస్తున్నది. పీకే సర్వే, ఇంటలిజెన్స్ సర్వే ప్రకారం చంద్రబాబును ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క చాన్స్ అయిపోయిందని భావించిన జగన్, ఇలాంటి చర్యలకు దిగుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    YCP 11th List : వైసీపీ 11వ జాబితా.. ‘గొల్లపల్లి’కి బంపరాఫర్

    YCP 11th List : వైసీపీ అభ్యర్థుల ప్రకటనను మరింత వేగవంతం...