Jagityala Assembly Constituency Review : అసెంబ్లీ : జగిత్యాల నియోజకవర్గం
బీఆర్ఎస్ : సంజయ్ కుమార్
కాంగ్రెస్ : టీ. జీవన్ రెడ్డి
బీజేపీ : సరైన అభ్యర్థి లేడు
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల నియోజకవర్గానికి ప్రత్యేక శైలి. ఇక్కడ ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది జీవన్ రెడ్డి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ పై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. సంజయ్ కుమార్ కు 104247 ఓట్లు వస్తే జీవన్ రెడ్డికి 430625 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో సంజయ్ కుమార్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపొందారు.
జగిత్యాల నియోజకవర్గంలో వెలమ నేతలకు అచ్చొచ్చింది. నాలుగు దశాబ్దాలుగా వెలమ నేతలే గెలుస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న సంజయ్ కుమార్ కూడా వెలమ నేత కావడం గమనార్హం. 1978 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వారే విజేతలుగా నిలిచారు. ఇక్కడ నుంచి ఏడుసార్లు వెలమలు, మూడు సార్లు బీసీ నేతలు విజయం సాధించారు.
జీవన్ రెడ్డి 1983లో టీడీపీ తరఫున తొలిసారి గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా పొందారు. తరువాత నాదెండ్ల భాస్కర్ రావు పక్షాన చేరి కాంగ్రెస్ లో చేరి 1989లో మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. 1994లో ఓటమి పొందారు. అప్పుడు టీడీపీ తరఫున ఎల్. రమణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో కరీంనగర్ లోక్ సభ నుంచి రమణ ఎంపీగా గెలుపొందారు.
1999, 2004, 2014 ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్ సభ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. తిరిగి మంత్రి పదవిలో కొనసాగారు. నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పదిసార్లు, టీడీపీ నాలుగు సార్లు, పీడీఎఫ్ ఒకసారి, టీఆర్ఎస్ ఒకసారి, ఎస్టీఎఫ్ ఒకసారి గెలిచాయి.
1952లో ఇక్కడ నుంచి గెలిచిన బుట్టి రాజారాం 57లో సుల్తానాబాద్ లో, 62లో పెద్దపల్లిలో, 67లో నుస్తులాపూర్ లో నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో వెలిచాల జగపతి రావు, 1989లో కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. రాజేశం గౌడ్, ఎల్. రమణ కూడా ఇక్కడి నుంచే గెలిచారు. రాజేశం గౌడ్ ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి పదవిలో కొనసాగారు. రమణ 1995లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి పోటీలో ఉంటారు. ఇక టీఆర్ఎస్ లో అటు ఎల్. రమణ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరు వస్తారో తెలియడం లేదు. మొత్తానికి నియోజకవర్గంలో ద్విముఖ పోటీ ఉంటుందో లేదా త్రిముఖ పోరు నెలకొంటుందో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో గెలుపెవరిదో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.