
Jaiswal Miss Century : ఐపీఎల్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గురువారం రాత్రి కోల్ కత్తా నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ లో 13 బాల్స్ లో 50 రన్స్ చేశాడు. కానీ సెంచరీ మాత్రం చేజేతులా మిస్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన అర్ధశతకంగా నమోదైంది. ఈ మ్యాచ్ లో యశస్వి 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సెంచరీ పూర్తి చేయకపోవంతో రాజస్థాన్ టీం నిరుత్సాహానికి గురయ్యారు. కోలకత్ స్పిన్నర్ సుయాశ్ శర్మనే దీనికి కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెంచరీ కావద్దనే ఉద్దేశ్యంతోనే ఎక్కువగా వైడ్లు వేశాడరని అంటున్నారు.
మ్యాచ్ లో 13వ ఓవర్ లాస్ట్ బాల్ వేసే ముందు రాజస్థాన్ 147 రన్స్ తో విజయానికి 3 రన్స్ దూరంలో ఉంది. అప్పటికి యశస్వి 94 పరుగులతో ఉన్నారు. ఇంకో సిక్స్ కొడితే సెంచరీ అవుతంుది. కానీ క్రీజులో సంజూ శంసన్ ఉన్నాడు. గెలుపు ఎలాగైనా అయిపోయింది కాబట్టి ఒక్క బాల్ కు భారీ షాట్ ట్రై చేయకుండా ఉంటే తర్వాతి ఓవరల్ లో యశస్వి క్రీజులోకి వచ్చి సెంచరీ పూర్తి చేసుకుంటాడని సంజూ అనుకున్నాడు. ఆ ఓవర్ లో బౌలింగ్ చేసిన కోల్ కతా స్పిన్నర్ సయాన్ శర్మ చివరి బంతిని వైడ్ వేసేందుకు యత్నించాడు. ఆ బాల్ కీపర్ కు అందకుండా బౌండరీ వైపు పరుగులు తీసే అవకాశం ఉండేది. దీంతో జైస్వాల్ 94 వద్దే ఉండిపోయేవాడు. ఆ బాల్ ను గుర్తించిన సంజూ బంతిని ఎదుర్కోవడంతో పాటు రన్ కూడా తీయలేదు. యశస్వి వైపు చూస్తూ సిక్స్ కొట్టు అంటూ సైగ చేశాడు.
ఇక తర్వాత ఓవర్ లో శార్దూల్ ఠాకుర్ ఫస్ట్ బాల్ వైడ్ యార్కర్ వేసే ప్రయత్నం చేయగా.. జైస్వాల్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి తరలించి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. దీంతో యశస్వి 94 పరుగుల వద్దే ఉండిపోవాల్సి వచ్చింది.