Janhvi Kapoor :
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బడా నిర్మాత బోణీ కపూర్ ముద్దుల కుమార్తెగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన హాట్ హాట్ అందాలతో అందరిని తన వైపుకు తిప్పుకోవడంలో సఫలం అయ్యింది. ఇక ఈ భామ కూడా నటన పరంగా రాణిస్తుంది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ అనగానే లవ్ ఎఫైర్స్ కామన్ అంటుంటారు.. ఈ విషయంలో జాన్వీ కూడా తక్కువది ఏం కాదు.. ఈమె స్వయంగా తన ఫస్ట్ లవ్ గురించి చెప్పి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొదటి లవ్ గురించి జాన్వీ మాట్లాడుతూ..
నా ఫస్ట్ లవ్ అప్పుడు ఇద్దరిలో పరిణితి లేదు.. అందుకే అయోమయానికి గురి అయ్యాము.. అలాగే మా ప్రేమ మొత్తం అబద్ధాలతోనే సాగింది. పేరెంట్స్ మా చుదువు మీద ముందు ద్రుష్టి పెట్టమని చెప్పారు.. వారి మాట వింటే భవిష్యత్తు బాగుంటుంది అని నేను నమ్మడంతో నా మొదటి ప్రేమకు ముగింపు పలికాను.. అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
అంతేకాదు అతడి పేరు అక్షత్ రాజన్ అని తెలుస్తుంది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన ఈయనే జాన్వీ ఫస్ట్ లవ్ అంటూ టాక్ బిటౌన్ లో వినిపిస్తుంది. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ధఢక్ సినిమాతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చేస్తూ సౌత్ ఎంట్రీకి సిద్ధం అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మడికి ఇక్కడ కూడా వరుస అవకాశాలు రావడం ఖాయం..