Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. అయినప్పటికీ కూడా ఈమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ శ్రీదేవి కారణంగా వచ్చింది కాదు, ఈమె అందం కి వచ్చిన క్రేజ్ అన్నమాట. ఇంస్టాగ్రామ్ లో ఈమె రోజు అప్లోడ్ చేసే వీడియోలు, ఫోటోలు చూస్తే మగవాడు అన్న తర్వాత ఈమెకి ఫ్యానిజం చెయ్యకుండా అసలు ఉండలేరు.
కేవలం ఒకే ఒక్క హిట్ చాలు, ఈమె రేంజ్ వేరే లెవెల్ కి చేరుకోవడానికి అన్నట్టుగా ఉంది పరిస్థితి. బాలీవుడ్ లో ఎలాగో పని అవ్వడం లేదు, ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ కి వచ్చేసింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న ‘దేవర’ చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కూడా కాలేదు, అప్పుడే జాన్వీ కపూర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా, బుచ్చి బాబు దర్శకత్వం లో త్వరలోనే ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని ఇన్ని రోజులు తర్జన భర్జన పడిన తర్వాత బుచ్చి బాబు చివరికి జాన్వీ కపూర్ కి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే ఆమెని కలిసి ఈ కథని వినిపించగా, ఆమెకి వెంటనే నచ్చి ఓకే చెప్పేసిందట.
అయితే రెమ్యూనరేషన్ విషయం లో నిర్మాతలకు ఈమె చుక్కలు చూపిస్తోందట. దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నందుకు ఈమె దాదాపుగా 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది అట. కానీ రామ్ చరణ్ సినిమాకి మాత్రం మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకుంటుందట. ఇదేంటి ఒక హీరో కి ఒక రేట్, మరో హీరోకి ఇంకో రేట్?, అందరికి సమ న్యాయం చెయ్యాలి కదా, ఏమిటి ఈ అన్యాయం అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాన్వీ కపూర్ పై మండిపడుతున్నారు.