
షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”.. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా రిలీజ్ చేయగా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతుంది. రిలీజ్ అయ్యి 11 రోజులు అవుతున్న ఇంకా దూసుకు పోతూ కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది..
మొదటి షో నుండి పాజిటివ్ బజ్ తో దూసుకు పోతున్న జవాన్ మొదటి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక వీకెండ్ లోనే 500 కోట్లను వరల్డ్ వైడ్ గా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు హిందీ వర్షన్ లో మరో రికార్డ్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.. ఇంత వరకు మరో సినిమా బాలీవుడ్ లో ఈ రికార్డ్ క్రియేట్ చేయలేదట.
జవాన్ సినిమా రిలీజ్ అయిన 11 రోజుల్లోనే హిందీ బెల్ట్ లో ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ను సాధించినట్టు టాక్.. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని కలెక్షన్స్ రాబట్టలేదు.. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 797 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.. మరి 1000 కోట్ల క్లబ్ లో ఎప్పుడు చేరుతుందో వేచి చూడాలి..