40.3 C
India
Wednesday, May 1, 2024
More

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Date:

    Bollywood Actress
    Bollywood Actress Shilpa Shetty

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు అంత సులువుగా దొరకవు. వెండి తెరపై మెరుస్తున్న అందాల భామలు  కూడా ఒకప్పుడు అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొనన్న వారే. ఆ కష్టాలన్నీ అనుభవించిన తర్వాతే సక్సెస్ రుచి చూశారు.

    ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి కూడా ఈ కోవకే చెందుతారు. ఆమె సినీ కెరీర్ మొదట్లో  ఎంతో మంది నిర్మాతలు ఆమెను తిరస్కరించారు. అవకాశం ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా ఆమెకు చెప్పేవారు కాదు. కెరీర్ తొలినాళ్లలో  అవమానాలు భరించలేక ఎంతో  నిరుత్సాహానికి గురైంది. కానీ తన లక్ష్య సాధన కోసం తనకు తానే ధైర్యం చెప్పుకొని ధైర్యంగా అడుగు ముందుకు సాగింది. శిల్పా శెట్టి ఇప్పుడోక స్టార్ సెలెబ్రిటీ. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు ఫ్యాషన్, ఫిట్నెస్ ప్రపంచంలో నెంబర్ వన్.

    కెరీర్ తొలినాళ్లలో..

    శిల్పాశెట్టి తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’తో షేర్‌ చేసుకుంది. శిల్ప డార్క్‌గా, సన్నగా, పొడవుగా ఉండేది .గ్రాడ్యుయేషన్‌ తండ్రితో కలిసి పని చేయాలనుకున్నది. కానీ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడింది. అనుకున్న వెంటనే  అవకాశాలు దొరుకుతాయని ఆమె భావించలేదు. కానీ ఓ ఫ్యాషన్ షో ఆమె కెరీర్ లో కొత్త అడుగులు పడ్డాయి. ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటోలు తీయడంతో గ్లామర్‌ ఇండస్ట్రీకి పరిచయమైంది.

    17 ఏళ్ల వయసులో తొలి సినిమా ఆఫర్ వచ్చింది. అదే బాజీగర్. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. సక్సెస్ లు , ఫెయిల్యూర్స్ తో ముందుకు సాగింది.  తొలినాళ్లలో  హిందీ రాక ఇబ్బందులు పడింది. కొన్ని సినిమాల తర్వాత కెరీర్ ముగిసే పరిస్థితికి చేరుకుంది. ఎలాంటి రీజన్ లేకుండా ప్రొడ్యూసర్లు సినిమాల నుంచి తప్పించారు. కనీసం మాట్లాడే అవకాశ: కూడా ఇవ్వలేదు.

    బిగ్ బ్రదర్‌ షో విజేత.
    బిగ్ బ్రదర్‌ షోలో ఇతర కంటెస్టెంట్ల వివక్షకు గురైంది.  తాను పుట్టిన దేశం కారణంగా బహిరంగంగా వేధింపులు, వివక్షకు ఎదుర్కొంది.  కానీ పట్టుదలతో ముందుకు సాగింది. ఏ ఒక్క రోజు కూడా వెనకడుగు వేయాలని భావించలేదు. చివరికి ఆమె గెలుపు గర్వపడేలా చేసింది. తాను చూపిన పట్టుదల, పోరాట స్ఫూర్తి విజయాన్ని అందించాయి.
    తన కోసమే కాదు, జాత్యహంకారాన్ని ఎదుర్కొన్న బాధితులందరికీ ఆమె అండగా నిలిచింది. ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది.

    రాజ్ కుంద్రాతో వివాహం

    శిల్పా శెట్టి, ప్రముఖ  వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను 2009లో వివాహం చేసుకుంది. వారికి వియాన్, షమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ లో అత్యంత పాపులర్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఆమెకు రూ.100 కోట్ల విలువైన సీ ఫేసింగ్‌ బంగ్లా తో పాటు  విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఆమెకు ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

    ధడ్కన్ తో టాప్ హీరోయిన్ గా…

    1993 లో సినిమాల్లోకి వచ్చిన శిల్పాశెట్టి @అశ్విని శెట్టి షారూక్ మూవీ బాజీగర్ తో హీరోయిన్ పరిచయమయ్యారు. కానీ 2000 వరకు హీరోయిన్ అంతగా రాణించలేదు. అడపాదడపా హిట్లు ఉన్నా అవి ఆమెకు అంతగా ఉపయోగపడేలేదు.  2000 వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ ధడ్కన్ ఆమెను తిరుగలేని హీరోయిగాన నిలబెట్టాయి.  ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

    Share post:

    More like this
    Related

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Maruti Suzuki Alto : సేల్స్ లో ఈ కారును ఢీకొట్టేది లేదు..దీనిదే ఆల్ టైం రికార్డు  

    Maruti Suzuki Alto : కార్ల కంపెనీలకు ప్రస్తుతం భారత్ కల్పతరువు....

    Delhi Bomb Threats : ఢిల్లీలో కలకలం.. 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

    Delhi Bomb Threats : దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 100...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Bollywood Movie Offers : ఆఫర్లు.. మరింత దిగజారుస్తున్నాయా?

    Bollywood Movie Offers : 2024 ప్రారంభం బాలీవుడ్ అంతగా కలిసి...

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...