
Kirrak Sita : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. ఎవరిని అడిగిన కాస్టింగ్ కౌచ్ లేదు అని మాత్రం చెప్పడం లేదు.. అయితే ఇది బ్యాక్ గ్రౌండ్ లేని వారికీ మాత్రమే కాదు.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు కూడా ఎదుర్కొన్నట్టు చాలా మంది తెలిపారు. ఏది ఏమైనా నటీమణులకు సినీ ఇండస్ట్రీలో ఎక్కడో ఒక సమయంలో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎదుర్కొంటూనే ఉండాలి.
ముఖ్యంగా ఆఫర్స్ దక్కించు కోవాలంటే ఈ కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సిందే.. ఈ మధ్య మరీ ఎక్కువగా వినిపిస్తుంది.. మరి ఏ ముద్దుగుమ్మను కదిలించిన తమకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురయ్యింది అంటూ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో భామ ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.. ఆ భామ ఎవరంటే కిర్రాక్ సీత..
బేబీ సినిమాలో ఈమె బోల్డ్ క్యారెక్టర్ చేసింది.. ఆమె పాత్ర నెగిటివ్ గా ఉన్న విషయం తెలిసిందే.. అయితే ఈమె నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తర్వాత మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటుంది.. బేబీ మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది..
ఈ క్రమంలోనే ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యింది.. ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను.. చాలా వల్గర్ కామెంట్స్ మాట్లాడుతూ కొందరు అయితే గెస్ట్ హౌస్ కు రమ్మని అడిగారు.. చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా కమిట్మెంట్స్ ఇస్తే ఆఫర్స్ ఇస్తామని తెలిపారు.. కానీ నేను ఎప్పుడు అలాంటి వాటికీ ఒప్పుకోలేదు.. నా టాలెంట్ తోనే అవకాశాలు అందుకోవాలని నమ్మకంతో ఉన్నాను.. అంటూ ఈమె చెప్పుకొచ్చింది..