29.5 C
India
Sunday, May 19, 2024
More

    వేసవి సెలవులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసా?

    Date:

    summer holidays
    summer holidays

    వేసవి కాలం సెలవులు ఇచ్చేశారు. పిల్లలు ఇక ఇంటి వద్ద ఉంటారు. ఉంటే ఫరవాలేదు కానీ వారి అల్లరికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిందే. ఇంట్లో పిల్లల అల్లరికి ఆగ్రహం వస్తుంది. దీంతో వారిని రెండు దెబ్బలు కూడా వేస్తాం. కానీ అలా చేయకూడదు. వారిని సరైన దారిలో పెడితే సెలవుల్లో కూడా వారితో మనం సరైన పనులు చేయించవచ్చు. కాకపోతే దీనికి కొంత చొరవ తీసుకోవాలి.

    పల్లెటూళ్లకు పంపండి

    సెలవు రోజుల్లో వారు ఇంట్లో ఉంటే ఎండల్లో తిరుగుతుంటారు. దీని బారి నుంచి రక్షించుకోవాలంటే వారిని అమ్మమ్మ వాళ్ల ఊరికి పంపండి. దీంతో అక్కడి వాతావరణం వారికి బాగా ఉపయోగపడుతుంది. వ్యససాయ పనులు కూడా దగ్గరుండి చూడటం వల్ల అవగాహన ఏర్పడుతుంది. కాలుష్య రహిత పల్లెటూరులో కొంత కాలం ఉంటే వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది.

    స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దు

    పిల్లలకు ఎప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దు. దీని వల్ల వారికి కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయొద్దు. మొబైల్ ఫోన్ల వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు. దీనికి బదులు వారికి ఏవైనా ఇతర పనులు అప్పగించి వారిని బిజీగా ఉంచాలి.

    పిల్లలపై ఆగ్రహం చూపొద్దు

    పిల్లలను కసురుకోకూడదు. పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం. కానీ వారికి నచ్చ జెప్పాలి. అల్లరి పనులకు బదులు ఇండోర్ పనులు అప్పగించాలి. బొమ్మలు గీయడం, కథల పుస్తకాలు చదవడం వంటి పనులు చేయిస్తే వారి పనుల్లో వారు ఉంటారు. మన పనులు మనం చేసుకోవచ్చు. అంతేకాని వారు అల్లరి చేస్తున్నారని కసురుకుంటే వారు నొచ్చుకుంటారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Apple 15 Series : తొలిసారి టైప్-సీ పోర్ట్‌తో ఐపోన్ 15 విడుదల..!

    Apple 15 Series : టెక్ కంపెనీ యాపిల్ మంగళవారం తన...

    Cricket : రెండు ఓవర్లు వరుసగా ఒకే బౌలర్ వేయద్దు.. కానీ ఒక సారి వేయవచ్చు.. అదెప్పుడంటే?

    Cricket : అన్ని క్రీడలతో పోలిస్తే క్రికెట్ కు ఉన్న ఆదరణ వేరనే...

    Smart Phones : మీ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా దేని కోసం ఉపయోగిస్తున్నారో తెలుసా?

    Smart Phones : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. పిల్లల...