29.5 C
India
Sunday, May 19, 2024
More

    Khushi Movie : ‘ఖుషి’ ప్రీమియర్స్ లోనే అంత రాబట్టిందా.. కానీ.. ఆ డిజాస్టర్ కంటే తక్కువే..?

    Date:

    kushi movie 410 thousand dollars were collected for the premiers
    kushi movie 410 thousand dollars were collected for the premiers

    Khushi Movie :

    తెలుగులో ఎంత మంది హీరోలు ఉన్న ఇంకా కొత్త హీరోలు వస్తున్నా అందులో కొందరు మాత్రమే సత్తా చాటుతుంటారు.. మరి వారిలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఒకరు.. ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.
    ఈ మధ్యకాలంలో విజయ్ పెద్దగా హిట్ అందుకుంది లేదు.. అయినప్పటికీ ఈయన క్రేజ్ అస్సలు తగ్గలేదు.. ఇక ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ”ఖుషి” సినిమాతో వచ్చాడు. లైగర్ దారుణంగా నిరాశ పరచడంతో ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుని విజయ్ పూర్తి చేసాడు. ఇక ప్రమోషన్స్ కూడా ముందు నుండే చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసాడు.
    విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ”ఖుషి”.. ఈ రోజు సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. మరి యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ వేయగా ఊహించని వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషం అబ్దుల్ సంగీతం అందించారు.
    ఓవర్సీస్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా ప్రీమియర్స్ కు 410కే డాలర్స్ వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. అంటే మన కరెన్సీలో 3.38 కోట్ల గ్రాస్ అనే చెప్పాలి. అయితే ఇంత రాబట్టినప్పటికీ విజయ్ లైగర్ సినిమా ప్రీమియర్స్ కంటే తక్కువ అనే చెప్పాలి. విజయ్ లైగర్ సినిమాకు 504కే డాలర్స్ వచ్చాయి.. ఈ రికార్డ్ ను ఖుషి బీట్ చేయలేక పోయింది. మరి అధికారిక లెక్కలు చుస్తే కానీ అసలు విషయం తెలియదు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘ఖుషీ’పై కుట్ర చేసిందెవరు..?

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో  ‘ఖుషీ’ మూవీ తెరకెక్కించింది. సెప్టెంబర్...

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘అతి’ చెయ్యకపోవడం మంచిదైందా?

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. ఈ...

    Samantha & Vijay : సిల్లీ మాటలతో సమంతకు మరింత నష్టం.. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

    Samantha & Vijay : సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’...