32.5 C
India
Thursday, May 2, 2024
More

    Samantha & Vijay : సిల్లీ మాటలతో సమంతకు మరింత నష్టం.. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

    Date:

    Samantha & Vijay :
    సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, మిలియన్ డాలర్ల మార్కును అధిగమించి 1.5 మిలియన్ డాలర్ల మైలురాయి దిశగా పయనిస్తోంది.

    ముఖ్యంగా విజయ్ దేవరకొండ, సమంత, దర్శకుడు శివ నిర్వాణ గత సినిమాలతో పరాజయాలు చవిచూసిన చిత్రబృందానికి ఈ విజయం చాలా ఊపునిచ్చింది.

    అయితే ‘ఖుషి’ సినిమాను తన 17వ మిలియన్ డాలర్ల చిత్రంగా పేర్కొంటూ సమంత విజయాన్ని అతిశయోక్తిగా చూపించే ధోరణి కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.

    ఇలాంటి సంచలన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించడమే కాకుండా అనవసరమైన ట్రోలింగ్ కు కూడా దారి తీస్తాయి. ఈ లాజిక్ ను అనుసరించి బ్రహ్మానందం లేదా రావు రమేశ్ సౌత్ ఇండస్ట్రీ నుంచి అత్యధికంగా మిలియన్ డాలర్ల చిత్రాలను అందించిన నటుడిగా అర్హత సాధిస్తారు.

    సమంత తన ఇమేజ్ ను పెంచుకోవడం కంటే నెగిటివిటీని, ట్రోలింగ్ ను ఎక్కువగా ఆకర్షించే ఇలాంటి సిల్లీ పీఆర్ స్ట్రాటజీలకు దూరంగా ఉండటం మంచిది.

    విజయ్ దేవరకొండ ‘అతి’ చెయ్యకపోవడం మంచిదైందా?

    విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో సినిమా ఎలా ఉన్నప్పటికీ, డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. కనీసం ఆన్ లైన్ వరకూ అతికొద్ది నెగటివిటీ మాత్రమే ఉందని చెప్పుకోవాలి.

    సినిమాలో ఉన్న ఇష్యూస్ ఇప్పటికే M9.News రివ్యూ లో డిస్కస్ చేశాం. అయితే ఈ సినిమాకు ఆన్ లైన్ లో చాలా వరకూ డీసెంట్ గా వర్డ్ ఆఫ్ మౌత్ రావడానికి గల కారణాలు ఏంటి?

    సినిమా జోనర్ పెద్దగా నెగటివ్ మాట్లాడుకునే స్కోప్ ఇచ్చేది కాదు. ఇటువంటి సినిమాలు నచ్చకపోయినా పెద్దగా క్రిటికల్ అనాలిసిస్ చేసి దానిని చీల్చి చెండాడేవి కాదు. పైగా మ్యూజిక్, విజువల్స్, పెర్ఫార్మన్స్… లాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.

    అయితే విజయ్ దేవరకొండ తన సినిమాలను ఒకరకమైన హడావిడితో ప్రమోట్ చేసేవాడు. ఆ ప్రమోషన్ వల్ల విసిబిలిటీ వచ్చినా అంతే స్థాయిలో నెగటివిటీ కూడా వచ్చేది. చాలా మంది ‘అతి’ చేస్తున్నాడు అని అతని మీద కసి పెంచుకునేవాళ్ళు.

    లైగర్ అప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఈసారి మాత్రం విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.

    లైగర్ ప్లాప్ అయినప్పటి నుండీ మెయింటైన్ చేసిన సైలెన్స్ తో ట్రాల్స్ రాడార్ నుండి కొద్దిగా బయటపడ్డాడు. సినిమా జోనర్, రిలీజ్ ముందు సైలెన్స్ హెల్ప్ అయ్యి సినిమాని మరీ క్రిటికల్ గా చూసి ఎక్కెయ్యడం లాంటివి చెయ్యనివ్వలేదు.

    అయితే విజయ్ సైలెన్స్ అంటే టోటల్ గా సినిమా ని సైలెంట్ చేసేసి… ప్రమోషన్స్ ఆపేశారు. అది సినిమాని ఓపెనింగ్స్ అలాగే సినిమా మీద ఉన్న బజ్ ని దెబ్బ కొట్టే స్థాయికి వెళ్లడం ట్రాజెడీ.

    సైలెంట్ గా ఉంటేనే సినిమాను బాగా ప్రమోట్ చేసుకునే దారి ఒకటి చూసుకోవాలి విజయ్.

    Share post:

    More like this
    Related

    CSK VS PK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK VS PK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...