29.5 C
India
Sunday, May 19, 2024
More

    Modi Govt : వైద్య విద్యలో పెనుమార్పులు.. మోదీ సర్కారు సంచలన నిర్ణయాలు

    Date:

    modi
    modi

    Modi Govt : వైద్య విద్యలో పెనుమార్పులకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో ఉన్న పలు నిబంధనలకు మార్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతులు రావాలంటే తప్పనిసరిగా 24 విభాగాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన నుంచి నాలుగింటిని తొలగించింది. ఇందులో కీలకమనైన పల్మనరీ మెడిసిన్ విభాగాన్ని కూడా కేంద్రం, జాతీయ మెడికల్ కమిషన్ తొలగించింది. అయితే దీంతో పాటు ఎమెర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా తొలగించింది.

    అయితే ఇందులో భాగంగా కొత్తగా సమీకృత వైద్య పరిశోధనా విభాగాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అత్యవసర వైద్యానికి ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తున్నది. సాధారణ పడకలను 8 శాతం వరకు తగ్గించి, ఐసీయూ పడకలను 120 శాతం పెంచింది. దీంతో పాటు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్ మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. తద్వారా మోకాళ్ల నొప్పులు, దీర్ఘకాలిక నొప్పులు, నడుము నొప్పులు దీని కిందకు వస్తాయి. దీంతో పాటు యోగాను కూడా ఒక విభాగంగా ప్రవేశ పెట్టారు. ఈమేరకు వేర్వేరుగా ఆడ, మగకు శిక్షకులు ఉండాలని నిర్ణయించింది. దీంతో పాటు గతంలో మెడికల్ కాలేజీ 300 పడకలు ఉండాలనే నిబంధనను మార్చి 220కి తీసుకువచ్చింది.

    దీంతో పాటు కాలేజీకి సొంత భవనం ఉండాలనే నిబంధనను పక్కన పెట్టి 30 ఏండ్ల లీజుతో భవనం ఉన్నా సరిపోతుందనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో పాటు మెడికల్ కాలేజీకి, అనుబంధ వైద్యశాలకు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన వర్తింపు చేసింది.దీంతో పాటు మెడికల్ కాలేజీకి అనుబంధంగా వైద్యులు, సిబ్బంది 17 మందితో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను శిక్షణలో భాగంగా ఇక్కడికి పంపాల్సి ఉంటుంది. గతంలో ఎంబీబీఎస్ హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. తాజాగా రెసిడెంట్లకు దానిని తీసేశారు.

    అయితే ఇటీవల నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతినిచ్చింది. దీంతో ప్రైవేట్ కళాశాలల్లో కోట్లు పోసి చదువుకోలేని వారికి మేలు జరిగింది. ఎంబీబీఎస్ సీట్లు కూడా ఆయా రాష్ర్టాల్లో పెరిగాయి. రానున్న రోజుల్లో మెరుగైన వైద్యం కూడా సామాన్య ప్రజానీకానికి మరింతగా అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వం సవరించిన నిబంధనలపై హర్షం వ్యక్తమవుతున్నది ఒక్క పల్మనరీ మెడిసిన్ రద్దు చేయడంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prime Minister Modi: బంగారు కడ్డీతో రాముడికి కాటుక దిద్దినన్న ప్రధాని మోడీ

    అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాలు ప్రతిష్టకు సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం...

    Prime Minister Modi : గుడిలో నటుడి కుమార్తె పెళ్లి : హాజరైన ప్రధాని మోడీ

      కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు....

    Longest Bridge : సముద్రం పై పొడవైన అద్బుత వంతెన.. ఎంట్రీ కి రూ.350

    Longest Bridge Over Sea : ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు...