అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాలు ప్రతిష్టకు సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య ఈ వేడుక పట్టహాసంగా ప్రారంభం కానుంది. ముందుగా ప్రధానమంత్రి మోడీ రామ్ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు .ఆ తర్వాత స్వామివారికి చిన్న అద్దాన్ని చూపిస్తారు. అనంతరం 108 దీపాలతో మహా హారతి ఇవ్వడంతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుం ది.
గత కొద్ది రోజుల నుంచి యావత్ భారతదేశం అయో ధ్య రామాలయం కోసం ఎదురుచూస్తోంది. ఈరోజు మధ్యాహ్నం అయోధ్య రామ మందిరం ప్రారంభ మవుతుంది. అతిరథ మహారధులతో పాటు భారతదే శంలోని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అయోధ్య కు చేరుకున్నారు. ఎప్పుడేప్పుడు బాల రాముని ప్రతిష్ట జరుగు తుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తు న్నారు. అయోధ్య అంత రామనామ స్మరణతో మారు మ్రోగుతోంది.