35.8 C
India
Monday, May 20, 2024
More

    May 9 : మే 9  తెలుగు సినిమా ప్రపంచానికి విజయవంతమైన రోజు.. ఎన్ని విజయాలో చూద్దామా?

    Date:

    May 9-Telugu Cinema
    May 9-Telugu Cinema

    May 9-Telugu Cinema Industry : మే 9 సమ్మర్ హాట్ హాట్ గా ఉండే ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు విడుదల చేయడానికి సినీ నిర్మాతలు ముందుకొస్తుంటారు. వేసవి సెలవులు ఉండడం పిల్లలు, పెద్దలు చక్కగా సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వారిని థియేటర్లకు రప్పించడంలో నిర్మాతలు, డైరెక్టర్లు, హిరోలు పక్క ప్లాన్ వేసుకుని మూవీస్ ను రిలీజ్ చేస్తుంటారు.

    అలా మే 9 న రిలీజ్ అయి భారీ సక్సెస్ అందుకున్న కొన్ని చిత్రాల గురించి మళ్లీ ఓ సారి లుక్కేద్దాం.  మెగాస్టార్ చిరంజీవి, నటి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ మే 9, 1990 లో రిలీజైంది. అయితే అప్పుడు తుఫాన్ ప్రభావంతో థియేటర్లలోకి ప్రేక్షకులు వస్తారో రారో అని ఫిల్మ్ మేకర్స్ భయపడ్డారట. కానీ ధైర్యం చేసి విడుదల చేయడంతో కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ తో జనం ప్రభంజనంలా మారి థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నిండిపోయాయి. శ్రీదేవి దేవకన్యలా.. చిరు గైడ్ లా నటించిన ఈ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద హిట్ గా నిలిచిపోయింది.

    ఆ తర్వాత సంవత్సరం సేమ్ డేట్ కు రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ కూడా రప్పాడించింది. ఈ చేయి చూశావా రప్పాడిస్తా అంటూ చిరు మాస్ డైలాగ్ ఇప్పటికీ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ మూవీ ప్రేమించుకుందాం రా  కూడా మే9 తేదీనే విడుదలైంది. 1997 లో విడుదలైన ఈ మూవీ ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోని అమ్మాయిని ప్రేమించి ఎలా ఒప్పిస్తాడనేది సారాంశం. ఇందులో ఉండే లవ్ సీన్స్ అంటే 90 దశకంలో ఉన్న వారెవరూ ఎప్పటికీ మరిచిపోరు.

    నాగార్జున నటించిన సంతోషం మూవీ విదేశాలకు వెళ్లిన సంప్రదాయ తెలుగు ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అనుకోకుండా ఆమె చనిపోతుంది. అప్పుడు అల్లుడిని ఆ ఫ్యామిలీ దగ్గర తీసే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. ఇందులో పాటలు సూపర్ హిట్ కాగా, శ్రియ, నాగార్జున యాక్టింగ్ అదరహో అనేలా ఉంటుంది. ఇది కూడా మే 9 2002 లో విడుదలై భారీ హిట్ సొంతం చేసుకుంది. కీర్తి సురేశ్ నటించిన మహనటి 2018 మే 9, మహేశ్ బాబు నటించిన మహర్షి 2019, మే 9నే విడుదలై భారీ కలెక్షన్లు సాధించాయి. అందుకే ఈ రోజు అంటే తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు.. సినీ నిర్మాతలు, హిరోలు, దర్శకులకు గోల్డెన్ డేగా అభివర్ణిస్తారు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh కి గాయాలు.. ఇంతకీ ఏమైంది?

    Keerthy Suresh Injuries : కీర్తి సురేశ్ మొహంపై గాయాలు ఉండడంతో...

    విజయ్ దేవరకొండ – సమంత ల ఖుషి సినిమా రిలీజ్ డేట్ ఇదే

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత తాజాగా నటిస్తున్న చిత్రం ''...