38.1 C
India
Sunday, May 19, 2024
More

    Savitri First Interview : ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.. సావిత్రి మొదటి ఇంటర్వ్యూ ఎప్పుడైనా చూశారా..?

    Date:

    Savitri first interview
    Savitri first interview

    Savitri first interview : సావిత్రి గారి గురించి తెలియని వారు లేరు.. మహానటిగా సావిత్రి అభినయం గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె అభినయ అందం గురించి గొప్పగా వర్ణించిన తక్కువే.. ఆనాటి కాలంలో ప్రేక్షకుల మదిలో సావిత్రి అంటే చెరగని ముద్ర వేసుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుని ఉంది.. నేటి తారలకు స్ఫూర్తిగా మహానటి సావిత్రి నిలిచింది..

    మహానటి సావిత్రి గారు మొదటి ఇంటర్వ్యూ గురించి మీరు ఎప్పుడైనా చూసారా.. ఆమె ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. సావిత్రి గారు మాట్లాడిన ఈ వీడియోలో ఏముందో తెలుసా.. ఈమె మాట్లాడుతూ.. నా సినిమా జీవితం స్టార్ట్ అయ్యాక నేను చిన్నప్పుడు చిన్న పిల్లల ప్రోగ్రాంలలో అప్పుడప్పుడు పాల్గొని పాటలు పాడేదానిని..

    నేను పుట్టింది, పెరిగింది బెజవాడనే.. ముందు నుండి నేను డాన్స్ నేర్చుకోవడం వల్ల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండే దానిని.. మద్రాసులో జెమిని స్టూడియోలో తీసుకెళ్తే అన్ని బాగా చేస్తుంది కానీ మరో రెండేళ్ల తర్వాత తీసుకు రండి అన్నారట.. 13 ఏళ్ల వయసులో కాకినాడలో కళా పరిషత్ ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ అతిథిగా వచ్చిన పృథ్వీ రాజ్ కపూర్ సావిత్రిని చూసి సినిమాల్లో చేరమని సలహా ఇవ్వడంతో ఆమె 1949లో మద్రాసు ట్రైన్ ఎక్కారట.

    సంసారం అనే సినిమాలో మొదటగా ఎల్వి ప్రసాద్ కొన్ని షాట్స్ తీసిన తర్వాత వయసు మరీ తక్కువ ఉందని నటన బాలేదని ఆ సినిమా నుండి తీసేసి పాతాళభైరవి సినిమాలో గుర్తింపు లేని పాత్ర ఇచ్చారట.. దీంతో ఈమెకు నటన మీద మరింత పట్టు సాధించినట్టు తెలిపింది.. ఇక ఈమెకు 1953లో దేవదాసు సినిమా చేసింది.. ఈ సినిమాలో అలాంటి పాత్రను చేస్తానా లేదా అని భయపడ్డారు.

    కానీ నా తోటి కళాకారుల నుండి నటన నేర్చుకుని ఆ పాత్ర చేసానని తెలిపింది.. ఇక ఈ సినిమా సావిత్రి జీవితాన్ని మలుపు తిప్పింది.. అక్కినేని సరసన నటించి మెప్పించింది.. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడలేదు.. 1957లో మాయాబజార్ కూడా ఈమె నటన విశ్వరూపాన్ని చూపించేలా చేసింది.. ఆ తర్వాత అప్పటి స్టార్ హీరోలందరితో వందల సినిమాల్లో నటించింది.. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Best Actress : ‘ఉత్తమ నటి’ విషయంలో భానుమతి, సావిత్రి మధ్య రాజుకున్న వివాదం.. చివరికి ఏమైందంటే?

    Best Actress : సీని రంగంలో అవార్డుల విషయంలో అప్పుడప్పుడు కొన్ని...

    Keerthy Suresh కి గాయాలు.. ఇంతకీ ఏమైంది?

    Keerthy Suresh Injuries : కీర్తి సురేశ్ మొహంపై గాయాలు ఉండడంతో...

    విజయ్ దేవరకొండ – సమంత ల ఖుషి సినిమా రిలీజ్ డేట్ ఇదే

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత తాజాగా నటిస్తున్న చిత్రం ''...