31 C
India
Thursday, May 16, 2024
More

    Mega Family Bathukamma : అనాథ బాలికలతో మెగాస్టార్ ఫ్యామిలీ బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్!

    Date:

    Mega Family Bathukamma
    Mega Family Bathukamma

    Mega Family Bathukamma : మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్న వారికీ సహాయం చేసేందుకు ముందు ఉంటాడు.. మెగాస్టార్ గా పిలిపించుకునే చిరు ఆ పేరుకు న్యాయం చేస్తాడు అనే చెప్పాలి.. ఎవ్వరైనా ఈయనది పెద్ద మనసు అనకుండా ఉండరు.. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ఆరోగ్యం బాలేక పోతే తెలుసుకుని మరీ అపోలో ఆసుపత్రిలో వైద్యం ఇప్పిస్తున్నాడు.

    అలా ఎప్పటికప్పుడు మెగాస్టార్ ఘనతను చాటి చెప్పే విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.. తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీ తమ గొప్ప మనసును చాటుకున్నారు.. దసరా, బతుకమ్మ పండుగను అనాథ పిల్లలతో కలిసి జరుపుకుని వారి సంతోషానికి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ కారణం అయ్యారు..

    అనాథ బాలికలతో బతుకమ్మ ఆడారు.. రామ్ చరణ్, ఉపాసనతో పాటు మెగా లిటిల్ ప్రిన్సెస్ కూడా ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఈ వేడుకల్లో చరణ్ దంపతులతో పాటు మెగాస్టార్ ఆయన సతీమణి సురేఖ, సాయి ధరమ్ తేజ్, శ్రీజ, చిరు మనవరాళ్లు సైతం పాల్గొన్నారు..

    అంతేకాదు చిరంజీవి అమ్మగారు అయినా అంజనాదేవి చేతుల మీదుగా అక్కడికి వచ్చిన మహిళలకు చీరలు పంచి పెట్టారు.. దీనికి సంబంధించిన వీడియో ఉపాసన షేర్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.. ఉపాసన అమ్మమ్మ గత మూడు దశాబ్దాలుగా సేవా సమాజ్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అమ్మమ్మ పేరిట తాజాగా బతుకమ్మ సంబరాల్లో పేద, అనాథ బాలికలకు బట్టలు, విందు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరి ఆ వీడియో మీరు చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related