37.8 C
India
Saturday, May 18, 2024
More

    Miss Shetty Mr. Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

    Date:

    Miss Shetty Mr. Polishetty Review :

    నవీన్ పోలిశెట్టి అంటేనే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు మూవీలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. అందుకే ఆయన నటిస్తున్న తాజా మూవీ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తుండటంతో అందరికీ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. పైగా వయసులో నవీన్ కంటే అనుష్క చాలా పెద్దది కావడంతో హైప్ క్రియేట్ అయిపోయింది. నేడు థియేటర్ లోకి వస్తున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

    కథ..

    అన్విత (అనుష్క శెట్టి) లండన్ లో టాప్ చెఫ్‌. ఆమె తల్లికి గతంలో విడాకులు అవుతాయి. దాంతో కూతురుతోనే ఆమె కలిసి జీవిస్తోంది. కానీ తల్లికి అలా జరగడంతో అన్వితకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోతాయి. కానీ కూతురుకు ఎలాగైనా పెళ్లి చేయాలన్నది తల్లి కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆమె చనిపోతుంది. దాంతో తాను పెళ్లి చేసుకోకుండా సహజీవనం ద్వారా బిడ్డను కనాలని అన్విత అనుకుంటుంది. అందుకోసం ఐయుఐ (స్పెర్మ్ డోనర్) పద్ధతిని ఎంచుకుంటుంది. ఓ షోలో స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధూ పోలిశెట్టి (నవీన్)ని కలుస్తుంది. అతన్ని వీర్యదానం కోసం సెలెక్ట్ చేసుకుంటుంది. మరి అన్విత కోరికను నవీన్ తీర్చాడా, స్పెర్మ్ దానం చేయడానికి ఒప్పుకున్నాడా.. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అనేది మిగిలిన కథ.

    నటీనటుల పర్ఫార్మెన్స్..

    నవీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఆయన కామెడీ సీన్లతో చింపేశాడు. స్టాండప్ కమెడియన్ గా ఆయన చేసే యాక్టింగ్ అందరినీ నవ్విస్తుంది. అది సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. ఇక అనుష్క ఇందులో బోల్డ్ గా ఉండే ఎన్నారై పాత్రలో ఆకట్టుకుంది. కానీ ఇందులో ఆమె వయసైపోయిన అమ్మాయిలాగా కనిపించింది. ఇది అనుష్క ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే అంశం. అయినా సరే కథనంలో భాగంగానే ఆమె అలా ఉంటుంది. ఇక మిగిలిన మురళీశర్మ, జయసుధ, నాజర్, అభినవ్ గౌతమ్, హర్షవర్ధన్ లాంటి వారు తమ పాత్రలు పోషించి చక్కగా నటించారు.

    టెక్నికల్ పర్ఫార్మెన్స్..

    స్పెర్మ్ డోనర్ కాన్సెప్ట్ కు కామెడీని జోడించడం అనేది చాలా కొత్త కథ. డైరెక్టర్ మహేశ్ ఇలాంటి కథను హ్యాండిల్ చేయడంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు. కానీ పూర్తి స్థాయిలో కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు ప్రజలు స్పెర్మ్ డోనర్ కథలను యాక్సెప్ట్ చేసేంత స్థాయిలో లేరు. కాబట్టి వారికి ఇది అర్థం అయ్యే విధంగా చెప్పాలి. అప్పుడే వారు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో డైరెక్టర్ చేతులెత్తేశాడు. దానికి బదులు కామెడీని ఎంచుకున్నాడు. కథలో కామెడీ ఇమిడిపోయినట్టు ఉండాలి గానీ కామెడీనే కథ కాకూడదు కదా. ఆ విషయాన్ని మర్చిపోయాడు మనోడు. కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. రధన్ సంగీతం, గోపీసుందర్ అందించిన బీజీఎం ఆశించిన స్థాయిలో లేవు. పాటలు, బీజీఎం అనేవి సినిమాకు తిపెద్ద ప్లస్ పాయింట్లు. వీటి విషయంలో చేతులెత్తేశారు. ఇక నీరవ్ షా సినిమాటోగ్రఫీ, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్ పాయింట్లు..

    నవీన్ పోలిశెట్టి, అనుష్క నటన
    కామెడీ సీన్లు
    కొన్ని ఆకట్టుకునే డైలాగులు

    మైనస్ పాయింట్లు..

    సినిమాలో వేగం
    కథను బలంగా చెప్పలేకపోవడం

    చివరగా..

    స్పెర్మ్ డోనర్ అనేది తెలుగు ప్రజలకు చాలా కొత్త లైన్. కానీ దాన్ని కామెడీతో మలవడం మంచి ప్రయత్నమే. కానీ కామెడీనే నమ్ముకుని సినిమా చేయకుండా ఉంటే బాగుండేది. అక్కడక్కడా బోర్ కొట్టించినా సినిమాను మాత్రం ఒకసారి చూడొచ్చు.

    రేటింగ్ః2.5/5

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Miss Shetty Collections : ‘మిస్ అండ్ మిస్టర్’ 15వ రోజు లక్షల్లో.. మరో 45 లక్షలు వస్తే.. ఎంతంటే?

    Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న...

    Miss Shetty Mr Polishetty : ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    Miss Shetty Mr Polishetty : పోలిశెట్టి నవీన్ - అనుష్క...