Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి ఒకరు. మంచి ఫామ్ లో ఉన్న ఆయన ఇటీవల ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంలో నటించారు. క్రేజీ కాన్సెప్ట్ యూత్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మూడో వారానికి చేరినా డీసెంట్ గా వసూళ్లను రాబడుతోంది. 15 రోజుల్లో శెట్టి ఎంత వసూలు చేసిందో చూడండి.
ఇద్దరి పేర్లలోని పదాలను వాడుతూ వచ్చిన ఈ సినిమా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ తెరకెక్కించగా.. మహేశ్ బాబు డైరెక్టర్ గా వ్యవహరించారు. వీరితో పాటు జయసుధ, మురళీ శర్మ, తులసి, సోనియా, అభినవ్ గోమటం, దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.
యూత్ ఫుల్ స్టోరీ కావడంతో ప్రీరిలీజ్ నుంచి బిజినెస్ భారీగానే జరిగింది. థియేటికల్ రైట్స్ రూ. 12.50 కోట్లుకు అమ్ముడు పోయాయి. దీంతో 800 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి బాగా క్రేజ్ వచ్చింది. 15వ రోజూ వర్కింగ్ డే కావడంతో డౌన్ అయ్యింది. నైజాంలో రూ. 14 లక్షలు, ఆంధ్రాలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలతో కలిపి.. 15వ రోజు రూ. 27 లక్షలు షేర్, గ్రాస్ రూ. 50 లక్షలు సాధించింది.
15 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.10 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.21 కోట్లు వసూలయ్యాయి. 2 రాష్ట్రాల్లో 15 రోజుల్లో రూ. 13.16 కోట్లు షేర్, రూ. 23.45 కోట్ల గ్రాస్ రాబట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మేరకు గ్రాస్ దక్కించుకున్న మూవీ వరల్డ్ వైడ్ గా కూడా బాగానే రాణించింది. కర్ణాటకలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.79 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.10 షేర్ రాబట్టింది. ఇలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 23.05 కోట్లు షేర్, రూ. 43.90 కోట్లు గ్రాస్ దక్కించుకుంది.
‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ అంచనాలకు అనుగుణంగానే వరల్డ్ వైడ్ గా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ లక్ష్యం రూ. 13.50 కోట్లుగా నమోదైంది. 15 రోజుల్లోనే రూ. 23.05 కోట్లు షేర్ వచ్చింది. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.55 కోట్లు లాభాలు మూవీకి సొంతం అయ్యాయి.