32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Date:

    Anushka
    Anushka

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ భాహ హైటెక్కువగా ఉండడంతో ఆమెతో స్ర్కీన్ షేర్ చేసుకునే హీరోల సంఖ్య తక్కువే. అయినా ఈ కన్నడ భామతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ముందుగా సీనియర్ టాప్  హీరోలతో సినిమాలు చేసిన అనుష్క  ఆ తర్వాత టైర్ -2 హీరోల సినిమాల్లో చేస్తున్నది

    ‘సూపర్’ గా ఎంట్రీ
    టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వలో నాగార్జున హీరోగా రూపుదిద్దుకున్న సినిమా సూపర్. ఈ సినిమాతోనే కన్నడ భామ స్వీటీ శెట్టి అనుష్క శెట్టిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా అనుష్క మాత్రం హీరోయిన్ గా బాగా ఎలివేట్ అయ్యింది. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో  మాస్ మహరాజ రవితేజ హీరోగా తీసిన విక్రమార్కుడులో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అనుష్క వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.  ఆ తర్వాత  టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో జోడి కట్టింది.

    గోపీచంద్, ప్రభాస్ తో హిట్ పెయిర్
    గోపీచంద్  సినిమాల్లో హీరోయిన్ చేసిన అనుష్క సక్సెస్ లు కొట్టింది.  లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయవంతం కావడంతో హిట్ పెయిర్ అనిపించుకుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టింది. దీంతో ప్రభాస్ తోనూ హిట్ పెయిర్ అనిపించుకుంది.

    లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి బెస్ట్ ఆప్షన్
    విజయశాంతి, సౌందర్య, రమ్యకృష్ణ, ప్రేమ తదితర హీరోయిన్ల తర్వాత  లేడి ఓరియెంటెడ్  మూవీస్ కి అనుష్క బెస్ట్ ఆప్షన్ గా అనుష్క మాత్రమే కనిపిస్తుంది. అరుంధతి మూవీతో  తెలుగు తెరకు మరో  ఫిమేల్ లీడ్ యాక్టర్ దొరికింది. ఇక అక్కడి నుంచి అనుష్కను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సినిమాలు రాయించుకుంటున్నారు.

    దర్శకులకు కండీషన్లు.. రోటీన్ క్యారెక్టర్లు వద్దు..
    రొటీన్  క్యారెక్టర్లు తెస్తే డైరెక్టర్లు, నిర్మాతలకు నేరుగా చేయనని చెబుతుందట.  కేవలం ఫిమేల్ లీడ్ రోల్స్ మాత్రమే చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు మొఖం మీదే చెప్పేస్తున్నదట. దీంతో  గ్లామర్ క్యారెక్టర్లు రాసుకున్న డైరెక్టర్లు స్క్రిప్ట్ మార్చుకోక తప్పడం లేదట.  అనుష్క చేతిలో పెద్ద గా సినిమాలేమీ లేవు. ప్రస్తుతం ఆమె కేవలం రెండు చేస్తున్నట్లు ఫిలిం ఇండస్ర్టీ టాక్.  అందులో ఒకటి ఘాటి. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.  మరో మూవీతో అనుష్క మాలీవుడ్ లోకి ఇవ్వబోతున్నది. సినిమాల ఎంపిక విషయంలో మాత్రం సెలెక్టివ్ గా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...