Miss Shetty success : ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్, జాతిరత్నాలు సినిమాల విజయం తరువాత నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. అనుష్క హీరోయిన్ గా నటించింది. సినిమా భారీ విజయం అందుకుంది. పి.మహేష్ బాబు దర్శకత్వంల వచ్చిన సినిమా మూడో వారంలో భారీ కలెక్షన్లు సాధించి తనకు ఎదురు లేదని నిరూపించింది. బేబి సినిమాలా చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ అందుకుని అందరి అంచనాలు తలకిందులు చేసింది.
జవాన్ సినిమా వచ్చినా ఈ సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. జవాన్ తో పాటు దీనికి కూడా కలెక్షన్లు భారీగానే రావడం గమనార్హం. తొలి మూడు రోజులకే మిలియన్ డాలర్ కలెక్షన్లు కొల్లగొట్టడం సంతోషంగా ఉందని నవీన్ పొలిశెట్టి పేర్కొన్నాడు. సినిమా విజయంలో అతడి పాత్రే కీలకం. సినిమా ప్రమోషన్లలో కూడా అతడే రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి ప్రచారం నిర్వహించాడు.
మూడో వారంలో కూడా కలెక్షన్లు బాగానే ఉండటం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. సూపర్ హిట్ గా నిలిచింది. జవాన్ సినిమా విడుదలైన తరువాత కొంచెం భయం పట్టుకుంది. జవాన్ ఎక్కడ ఈ సినిమాను తొక్కిపెడుతుందో అనుకున్నారు. కానీ మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుందని సినిమా నిరూపించింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో కూడా మూడో వారంలో స్ర్కీన్ కౌంట్ పెంచారు. యూఎస్ ఏలో 180 లొకేసన్స్ లో స్క్రీన్స్ పెంచారు. సినిమా విజయం నాలో ఉత్సాహాన్ని నింపిందని హీరో నవీన్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని గుర్తు చేసుకుంటున్నాడు. జాతిరత్నాలు సక్సెస్ తో నిర్మాతల్లో నమ్మకం కలిగింది. దీంతో నాతో సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు. వారికి నష్టం రాకుండా చూసుకోవడమే మా బాధ్యత అంటున్నాడు.