31.6 C
India
Sunday, May 19, 2024
More

    Chandrayaan-3 : నెహ్రూ మొదలుపెట్టాడు.. మోడీ ‘చంద్రుడి’పైకి తీసుకెళ్తున్నాడు..

    Date:

    Chandrayaan-3 :

    1962లో మొదలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎన్నో ఘనతలను సాధిస్తున్నది. శుక్రవారం ప్రయోగించిన చంద్రయాన్ 3తో మరింత ఎత్తుకు ఇస్రో ఘనత దూసుకెళ్లింది. అఖండ భారతం అసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఆనందంలో దేశమంతా మునిగి తేలింది.

    ఈ సందర్భంగా ఇస్రో సాధించిన ఈ ఘనత లో ఎందరో శాస్ర్తవేత్తల కష్టం దాగి ఉంది. ఈ ఇస్రో పితామహుడు విక్రం సారాభాయ్ వేసిన మొదటి అడుగు.. నేడు ఎన్నో ప్రయోగాలకు వేదికగా మారింది. ప్రపంచం మొత్తాన్ని అబ్బురపరిచేలా నాటి నుంచి నేటి వరకు సాగిన ఇస్రో ప్రయాణం ఎన్నో రికార్డులను తాకింది.

    1957లో రష్యా ప్రయోగించిన స్పుత్నిక్  ప్రయోగం.. శాటిలైట్ అవశ్యకతను నాడు విక్రమ్ సారాభాయ్ ప్రధాని నెహ్రూకు వివరించి, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ కు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాతే ఇక  అంతరిక్షంలో భారత హవా మొదలైంది.

    దినదినాభివృద్ధి సాధిస్తూ ఎన్నో ప్రయోగాలకు వేదికైంది. ఇస్రో తన ప్రయోగాల నివేదికను కేవలం దేశ ప్రధానితో మాత్రమే పంచుకుంటుంది. అంటే దీనికి మన దేశం ఇస్తున్న ప్రాధాన్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాడు నెహ్రూ బీజం వేసిన ఇస్రో..

    నేడు ఎన్నో ఘనకీర్తులను సాధించింది. విద్యా, వ్యవసాయ, కమూ్యనికేషన్, రక్షణ రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర ఇస్రోదే. ప్రపంచంలోనే 6 అతిపెద్ద అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా ఇస్రోకు పేరుంది. వాతావరణసూచన, విపత్తు నిర్వహణ, భౌగోళిక సమాచారం వ్యవస్థలు, నావిగేషన్, దూర విద్య ఉపగ్రహాలు, తదితర రంగాలకు సంబంధించి ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది.

    ప్రస్తుతం తిరువనంతపురం, శ్రీహరికోట, అహ్మదాబాద్, హైదరాబాద్ కేంద్రంగా వివిధ సేవలు కొనసాగుతున్నాయి. మొట్టిమొదటి ఉపగ్రహం 1975లో అర్యభట్ట పేరుతో సోవియేట్ యూనియన్ లాంచింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించింది. ఆ తర్వాత ఎన్నో రాకెట్లను అంతరిక్షంలోకి ప్రయోగించింది.

    ప్రధాని మోదీ అయ్యాక స్వదేశీ నాలెడ్జ్ ను ప్రోత్సహించడం మరింత పెరిగింది. ముఖ్యంగా రక్షణ రంగం విషయంలో ఆయన దేశీయ రూపకల్పనలను ప్రోత్సహిస్తున్నారు. ఇస్రో ప్రయోగాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సైంటిస్ట్ ల కు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారమందిస్తూ నేడు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం చేయడంలో  ఆయన పాత్ర ఎంతో ఉందనడంలో సందేహం లేదు.

    చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై మువ్వన్నెల రెపరెపలు మొదలైనట్లేనని భావిస్తు్న్నారు. అర్యభట్ట నుంచి నేటి వరకు ఇస్రో ప్రస్థానం అసలు విద్యార్థులందరికీ ఒక పాఠం. తడబాటుతో తొలుత సాగిన ఈ ప్రయాణం ఎన్నో ఘనతలు సాధించింది. ఏపీలోని నెల్లూర్ జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దేశంలోనే  ఎన్నో ప్రయోగాలకు వేదికైంది.

    ఏమాత్రం సౌకర్యాలు లేని  సమయంలో భారత్ ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. నాడు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయినా, నేడు భారత్ సాధించిన విజయాలు చూసి అవి నెవ్వెరపోతున్నాయి. అగ్రదేశాలకు దిమ్మ తిరిగే ఫలితాలు సాధించాయి. 2008లో తొలి చంద్రయాన్ ప్రయోగం చేసింది. 2014 లో మంగళయాన్ ద్వారా అంగారక గ్రహంపై అడుగు పెట్టింది.

    2016లో ఒకే రాకెట్ 20 ఉపగ్రహాలు, 2017లో ఒకే రాకెట్ తో 104 ఉపగ్రహాలు ప్రయోగించింది. ఇది ప్రపంచ రికార్డు. ఇలా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. గతంలో అమెరికా అంక్షల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఇస్రో.. నేడు ప్రధాని మోదీ హయాంలో మరిన్ని ఘనతలు సాధిస్తూ దూసుకెళ్తున్నది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prime Minister Modi: బంగారు కడ్డీతో రాముడికి కాటుక దిద్దినన్న ప్రధాని మోడీ

    అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాలు ప్రతిష్టకు సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం...

    Prime Minister Modi : గుడిలో నటుడి కుమార్తె పెళ్లి : హాజరైన ప్రధాని మోడీ

      కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు....

    Longest Bridge : సముద్రం పై పొడవైన అద్బుత వంతెన.. ఎంట్రీ కి రూ.350

    Longest Bridge Over Sea : ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు...

    PM Modi : షెడ్యూల్ కంటే నెల ముందే ఎన్నికలకు వెళ్తున్న మోడీ?

    PM Modi : ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఉత్సాహంగా...