34.3 C
India
Wednesday, May 15, 2024
More

    Mortuary : చనిపోయాడనుకుని మార్చురీకి.. తరువాత ఏం జరిగింది?

    Date:

    mortuary
    mortuary

    Mortuary : ఒడిశా రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని ఖరీదు ప్రాణాలే కావడం గమనార్హం. ఎటుచూసినా హాహాకారాలే. రైలు ప్రమాద సంఘటన చూసిన ప్రతి వారి గుండె ఝళ్లుమంది. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది. ఈనేపథ్యంలో ఎంతోమంది క్షతగాత్రులుగా మిగిలారు. మరి కొంత మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.

    ఒడిశా ప్రమాదం కనీవినీ ఎరుగని రీతిలో చోటుచేసుకుంది. రాత్రి వేళ ఏం జరుగుతుందో తెలియదు కానీ పెద్ద శబ్ధం మాత్రం వచ్చింది. దీంతో అక్కడ ఏం జరిగిందో తెలియక ముందే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో బెంగాల్ ప్రయాణికుడు బిశ్వజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్య సిబ్బంది వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.

    రెండు రోజుల తరువాత వారు వచ్చి పరిశీలించగా అతడు బతికే ఉన్నాడు. దీంతో వారు అప్రమత్తమై వైద్యులకు సూచించగా వారు చికిత్స చేసి బతికించారు. కనీసం ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలుసుకోకుండా చనిపోయాడని నిర్ధారించుకోవడం దారుణం. దీనిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    బతికున్న వాడినే చనిపోయాడని అనుకోవడం అంటే వారి నిర్లక్ష్యమే తప్ప అందులో ఏం లేదు. కానీ వైద్య సిబ్బంది తీరు హాస్యాస్పదంగానే మారింది. బతికున్న వాడిని శవంగా చేసే సత్తా వారికి దక్కుతోంది. వారి తీరు పలువురిని విమర్శలు చేసేలా చేస్తోంది. ప్రాణాలతో ఉన్నవాడిని మార్చురీకి తరలించి వారిలో మానవత్వం లేదని నిరూపించారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...

    Falak Numa Super Fast : ఫలక్ నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అగ్నిప్రమాదం

    నల్లగొండ జిల్లా పగిడిపళ్లి వద్ద నిలిపివేసి మంటలను ఆర్పుతున్న సిబ్బంది. ...

    Trains canceled : విజయవాడ-విశాఖ మార్గంలో 8 రైళ్లు రద్దు

    Trains canceled : విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో...