40.2 C
India
Sunday, May 19, 2024
More

    Pawan : పవన్ నిర్లక్ష్యం వల్లే కొత్త పార్టీ..! పేరు ఏంటంటే?

    Date:

    ramachandra yadav
    ramachandra yadav
    Pawan ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏపీలో కొత్తగా మరో పార్టీ అవతరించింది. జనసేన అధినేత పవన్ కళ్మాణ్ ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో పొత్తు చేసుకొని ఈ సారి ఎలక్షన్ లో ఎలాగైనా లబ్ధి పొందాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఓ నాయకుడు దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పార్టీ పెట్టాడు. జనసేనానిపై నమ్మకం లేకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. గత ఎలక్షన్ప్ అయినప్పటి నుంచి నాలుగేళ్లు ఓ పార్టీ లో తిరిగి పార్టీ అధినేతపై అపనమ్మకంతో మరో పార్టీ పెట్టడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
    ఏపీలో గత ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ పోటీ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గల పరిణామాల దృష్ట్యా సొంతంగా ఓ కొత్త పార్టీ పెట్టాడు. పవన్ తన ఉపన్యాసాల్లో ఉన్న ఫైర్‌ను ఆచరణలో పెట్టడం లేదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన పార్టీకి ‘భారత చైతన్య యువజన పార్టీ’ అని పేరు కూడా పెట్టాడు. ఈ సందర్భంగా గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంకు ఎదురుగా భారీగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశాడు.
    పుంగనూరులో చెప్పుకోదగ్గ పేరు గల నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు కలిగిన పారిశ్రామికవేత్త  రామచంద్ర యాదవ్. జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్లు సంపాదించుకోగలిగాడు. అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై తన వంతుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాడు.
    కానీ ఈ రామచంద్ర యాదవ్ కు స్థానికంగా ఉండే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ గుదిబండలా మారాడు. రామచంద్ర రావు యాదవ్ నిర్వహించే ప్రతీ కార్యక్రమంను మంత్రి అడ్డుకుంటున్నాడు. అప్పుడప్పుడు రామచంద్ర  యాదవ్ ను ఇంటి నుంచి బయటికి రాకుండా గృహ నిర్భందం చేస్తూ మంత్రి చాలా ఇబ్బంది పెడుతున్నాడని పుంగనూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కూడా రామచంద్ర యాదవ్ కు అనుకూలంగా ఎప్పుడూ స్పందించక పోయే సరికి సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నాడు. ఈ కొత్త పార్టీ ఆవిర్భావం వల్ల రామచంద్ర యాదవ్ కు ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ జనసేనకు మాత్రం తీవ్ర నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...