Niharika’s Husband Chaitanya :
మెగా ప్రిన్సెస్ గా మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు ఉంది.. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. ఈ భామ నటనతో మెప్పించినప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది. ఈ క్రమంలోనే ఈమె సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కానీ నిర్మాతగా మారి చిన్న చిన్న సినిమాలను నిర్మించింది. అంతా బాగున్న తరుణంలోనే నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయింది అంటూ వార్తలు వచ్చాయి.. అయితే ఎన్ని రోజులుగా రూమర్స్ వస్తున్న ఈ జంట మాత్రం స్పందించలేదు.
వీటిని నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉండగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో సిద్ధూ ఫ్యామిలీ ఎక్కడ కనిపించకపోవడంతో కన్ఫర్మ్ అయ్యింది. ఎవరి జీవితాన్ని వారు ఒంటరిగానే గడుపుతున్నట్టు అర్ధం అయ్యింది. అయితే తాజాగా వీరికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న నిహారిక భర్త తాజాగా ఒక పోస్ట్ చేసాడు. 4 నెలల తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.. ఇతడు ప్రస్తుతం మహారాష్ట్ర లోని ఒక మెడిటేషన్ సెంటర్ లో ఉన్నట్టు ఆయన పెట్టిన ఫోటోల ద్వారా అర్ధం అవుతుంది.. ఈయన ఈ ఫోటోలు షేర్ చేస్తూ..
”ఈ స్థలం.. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను.. గత 10 రోజులుగా నా జీవితంలో జరుగుతున్న ఈ ప్రాకృత ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఒక చోటుకు ఏ అందనలు లేకుండా వెళ్లి అక్కడ అద్భుతమైన జ్ఞాపకాలను పోగేసుకుని తిరిగి వస్తాం.. ఇది అలాంటిదే అంటూ ఈయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.