Niharika Konidela and Chaitanya : అనుమానించే నిజమైంది. మెగా డాటర్ విడాకుల బాటపట్టింది. ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రెటీల పెళ్లిళ్లు పట్టుమని పది కాలాల పాటు నిలవడం లేదు. మొన్నటికి మొన్న నాగచైతన్య-సమంత బాటలోనే ఇప్పుడు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ దంపతులు నిలిచారు.
నిహారిక-చైతన్యలు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.మే 19 న విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నీహారిక చైతన్యలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఈ జంట పరస్పర విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకుల ప్రక్రియ పూర్తయింది. విడాకుల డిక్రీ మంజూరైనట్లు సమాచారం. దీంతో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్టైంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కోలుకోలేని విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని ప్రచారం జరుగుతోంది.
మార్చి 2023లో చైతన్య జొన్నలగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న చిత్రాలను తొలగించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఇది బ్రేకప్ పుకార్లకు దారితీసింది. అయితే, నిహారిక అప్పటికి ఆ ఫొటోలను తొలగించలేదు. ఆ తర్వాత నిహారిక కూడా తమ చిత్రాలను తొలగించింది. ఈ అనుమానాలు నిజమైంది.
ఇటీవల, చైతన్య జెవి గ్లోబల్ విపస్సనా పగోడా ధ్యాన కేంద్రంలో 10 రోజుల పాటు ధ్యానాన్ని అభ్యసించారు. దీంతో మానసికంగా ధృడంకోసం ఇలా చేస్తున్నట్టు అర్థమైంది. నిహారికతో గొడవలు కారణంగానే ఇలా చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి విడాకులు ఇప్పుడు అధికారికంగా పూర్తి అయ్యాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది.
విడాకులు మంజూరైన అనంతరం చైతన్య ఒక బాధకరమైన పోస్ట్ చేశారు. ‘నాలుగు నెలల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఓ మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేసిన చైతన్య .. ఇలా రాసుకొచ్చాడు. నేను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ చాలా థాంక్స్. మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది కూడా అలాంటిదే’ అని రాసుకొచ్చాడు చైతన్య.
ఈ స్థలం దగ్గరకు రావడానికి నన్ను నడిపించిన అందరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా విపస్సనా యోగను చేయడంతో నా జీవితం ఇప్పుడు కాస్తా ఉల్లాసంగా ఉంటోంది. ఒకరి జీవితంలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎటువంటీ అంచనాలు లేకుండా వచ్చి తమకు తెలియని జ్ఞానంతో బయటకు వస్తానని నేను ఊహించలేదు. ఈ సమయంలో అండగా ఉన్నందకు కృతజ్ఞతలు అంటూ ఇన్ స్టా లో పోస్టు పెట్టారు