Niharika-Chaitanya :
మెగా ప్రిన్సెస్ గా మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా నిహారిక కొణిదెలకు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు ఉంది.. మెగా ఫ్యామిలీ నుండి ఏకైక హీరోయిన్ గా వచ్చిన ఈ భామ కెరీర్ లో రాణించలేక పోయింది.. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది. కానీ ఇక్కడ కూడా ఈ భామ తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోలేక పోయింది.
అంతా బాగున్న తరుణంలోనే నిహారిక తన భర్త జొన్నలగడ్డ సిద్ధూతో విడిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఎన్నో రోజులుగా వస్తున్న ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ ఈ రోజు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ విడాకులు తీసుకున్నట్టు తెలిపారు.. దీంతో ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ కు తెరపడింది.
ఇదిలా ఉండగా ఈ జంట హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీరి విడాకుల గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. ఈ విడాకుల వ్యవహారం ముందుగా ఎవరు మొదలు పెట్టారు.. అనే విషయం గురించి బయటకు వచ్చింది.
ముందుగా కోర్టులో విడాకుల పిటిషన్ ను దాఖలు చేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని తెలుస్తుంది.. ఈ విషయం కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది.. ఆ తర్వాత నిహారిక కూడా అందుకు ఒప్పుకుని డివోర్స్ కోసం అంగీకరించిందట.. ఆ తర్వాత ఈమె కూడా కళ్యాణ్ దిలీప్ సుంకరతో పిటిషన్ వేయించిందని తెలుస్తుంది.
వీరి విడాకుల హియరింగ్ మే 19న, ఆ తర్వాత రెండవ మే 29న, మూడవ హియరింగ్ జూన్ 5అణా జరుగగా ఇదే రోజు విడాకులు మంజూరు అయ్యాయట.. ఇక విడాకులు మంజూరు అయిన నెల తర్వాత ఈ రోజు వీరిద్దరూ అఫిషియల్ గా తెలిపారు.