Niharika – Chaitanya : ఈ రోజు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న జంట ఎవరంటే నిహారిక కొణిదెల – జొన్నలగడ్డ చైతన్య అనే చెప్పాలి. ఎందుకంటే వీరు ఈ రోజు విడాకులు తీసుకుంటున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నోట్ షేర్ చేసారు. దీంతో ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడింది.
2020లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నిహారిక-చైతన్య వివాహాన్ని మెగా కుటుంబం చాలా గ్రాండ్ గా జరిపించింది. అయితే పెళ్లి జరిగి రెండేళ్లు నిండగానే విడాకుల వరకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకు ఎంతో అన్యోన్యంగా ఉండే జంట విడిపోవాల్సి వచ్చింది అని ఇప్పుడు అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు.
మరి నిహారిక – చైతన్య విడాకులకు కారణం బయట పడింది.. ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయంపై ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిహారిక సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన విషయం తెలిసిందే.. ఈమె పెద్ద నాన్న చిరంజీవి నుండి నిహారిక అన్న వరుణ్ వరకు అంతా సినీ స్టార్స్ గానే రాణిస్తున్నారు.
అయితే చైతన్య అలా కాదు.. ఈయన సాఫ్ట్ వేర్ కావడంతో ఈయనకు సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు.. అయితే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడానికి కారణం వీరి ప్రొఫెషన్ అనే తెలుస్తుంది. ఎందుకంటే నిహారికను పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని చెప్పడం.. ఆమెకు ఆంక్షలు విధించడమే విడాకుల వరకు దారితీయడానికి కారణం అని తెలుస్తుంది.
ReplyForward
|