Bigg boss బిగ్ బాస్ షోకు అత్యంత ప్రజాదరణ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో సీజన్ కు వెళ్తోంది. త్వరలో ఏడో సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. దీంతో అభిమానుల్లో సందడి నెలకొంది. ప్రేక్షకుల్లో ఆసక్తి రేగినా కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. దీంతో షో పై పలు అనుమానాలు వచ్చాయి. కొన్ని కోర్టు వరకు వెళ్లాయి.
గతంలో సీపీఐ నేత నారాయణ బిగ్ బాస్ షో అశ్లీలతతో కూడుకున్నదని పలుమార్లు ఆరోపించారు. ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో షో నిలిపివేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఏడో సీజన్ పై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. మాటీవీ యాజమాన్యానికి, నాగార్జునకు నోటీసులు వచ్చాయి.
దీంతో షో నిర్వహణ ఎలా ముందుకు వెళ్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహణ సందిగ్ధంలో పడినట్లు అయింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. గతంలో కూడా చాలా సార్లు ఈ షోపై కోర్టులో పిటిషన్లు దాఖలైనా ఇప్పుడు మాత్రం అడ్డంకులు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇటీవల ఏడో సీజన్ కు సంబంధించిన టీజర్ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన వాటి కంటే ఇప్పుడే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు కోర్టు నోటీసులు రావడంతో షో నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. షో ఇక మీదట ఎలా ముందుకు వెళ్తుందో అనేది సందేహమే.