వ్రషభ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ఇష్టదేవతారాధన చేయడం శుభకరం.
మిథున రాశి వారికి ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు పెరుగుతాయి. చేసే పనుల్లో శ్రమ కూడా ఎక్కువవుతుంది. ఆర్థిక లాభాలున్నాయి. ఆంజనేయ స్వామిని దర్శిస్తే ఎంతో మేలు కలుగుతుంది.
కర్కాటక రాశి వారికి శుభ సమయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. అందరితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన చేయడం మంచి చేస్తుంది.
సింహ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభాలు కలిగిస్తుంది.
కన్య రాశి వారికి మంచి ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్ పై నిర్ణయాలు తీసుకుంటారు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. శివనామాన్ని జపించడం మంచి ఫలితాలు ఇస్తుంది.
తుల రాశి వారికి ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాధ్యానం చేయడం మంచిది.
వ్రశ్చిక రాశి వారికి ఒక వార్త విచారం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహాన్ని తీసుకొస్తాయి. కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సూర్యారాధన శుభప్రదం.
ధనస్సు రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. లక్ష్మీధ్యానంతో మనోబలం పెరుగుతుంది.
మకర రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధించడం మంచి ఫలితాలు తెస్తుంది.
కుంభ రాశి వారికి ప్రయాణాల్లో లాభాలున్నాయి. కీలక విషయాలు వాయిదా వేయడం మంచిది. ఎవరితోనూ గొడవకు దిగకండి. ఇష్టదైవాన్ని కొలిస్తే మేలు జరుగుతుంది.
మీన రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. ఇష్టదేవతారాధన చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
ReplyForward
|