Rajamouli :
టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి.. ఈయన సినిమాలను తెరకెక్కించే తీరుతో ప్రేక్షకులను తన ఫ్యాన్స్ గా కట్టి పడేసుకున్నారు.. రాజమౌళి చెక్కిన సినిమాలు కొన్నే అయినప్పటికీ అన్ని కూడా బ్లాక్ బస్టర్స్ అనే చెప్పాలి.. తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి.
ఇక ట్రిపుల్ ఆర్ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. మరి ప్రజెంట్ జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ వర్క్ తో, ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఇది కాకుండా ఈయనకు మహాభారతాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించాలని కోరిక కూడా ఉందని అందరికి తెలుసు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి స్వయంగా తెలిపారు.. దీంతో రాజమౌళి మహాభారతం ఎప్పుడెప్పుడు తీస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు..
ప్రజెంట్ మహాభారతం గురించి రాజమౌళి తండ్రి చెబుతూ.. మహేష్ సినిమా పూర్తి కాగానే మహాభారతం ఉంటుంది అని వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు.. ప్రజెంట్ మహేష్ తో చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుందని.. విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే త్వరలోనే ఆర్ఆర్ఆర్ 2 కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.. దీన్ని బట్టి 2 ఏళ్ల తర్వాత మహాభారతం స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.