36.9 C
India
Tuesday, April 21, 2026
More

    రాజమౌళి భారీ ప్లాన్.. ఆ సినిమాకు అన్నీ తనే..!

    Date:

    rajinikanth-ss-rajamouli-do-you-know-ss-rajamoulis-wish
    ss-rajamouli

    టాలీవుడ్ కు మొదటి సారి ఆస్కార్ తెచ్చిపెట్టిన రాజమౌళి ఇప్పటి వరకూ తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టరేనని ఘంటాపథకంగా చెప్పవచ్చు. వందల ఏళ్ల సినీ చరిత్రలో బాహుబలితో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు దృష్టి పెట్టిందంటే క్రెడిట్ గోస్ టూ  జక్కన్నే.

    అందరు డైరెక్టర్లు నెలల్లోనే సినిమాపూర్తి చేస్తే రాజమౌళి మాత్రం సంవత్సరాల కాలం తీసుకుంటాడు. సినిమాను శిల్పం చెక్కినట్లు చెక్కుతారు కాబట్టి ఆయనకు ఇండస్ట్రీ టాలీవుడ్ జక్కన్న అని పిలుస్తుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే..

    రాజమౌళి కుటుంబం మొత్తం చిత్ర సీమకు సేవలు చేస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన భార్య రమా రాజమౌళి, వదిన శ్రీవల్లి, అన్న కీరవాణి, తండ్రి విజయేంద్ర ప్రసాద్, కొడుకు కార్తికేయ వీళ్లంతా రాజమౌళి తీసే సినిమాలో భాగస్వాములు. కాబట్టి ఆయన తీస్తున్న ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో భారీ కలెక్షన్లు సాధిస్తుంది.

    ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తీసే ప్రతీ సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు సినిమాకు వచ్చే ప్రాఫిట్ లో వాటా కూడా తీసుకుంటారు. బాహుబలి సినీస్ కు రూ. 100 కోట్ల వరకూ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇక ఆస్కార్ అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’కు రెమ్యునరేషన్, ప్రాఫిట్ మొత్తం కలిపి రూ. 200 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. దానికి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

    ఈ సినిమా తర్వాత ఆయన సొంత కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ తీయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల నుంచి టాప్ స్టార్లను ఎంచుకుంటారట. ఆ దిశగా ఇప్పటి నుంచి కసరత్తు కూడా మొదలు పెట్టినట్లు చిత్ర వర్గాలు చెప్తుండగా ఈ సినిమాకు ప్రొడ్యూసింగ్ చేసేందుకు ఇప్పటికే చాలా సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇండియా వైజ్ గా టాప్ స్టార్లతో సినిమా తీస్తున్నాడు కాబట్టి పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవుతుంది. రెమ్యునరేషన్, ప్రాఫిట్ లతో కలిసి చాలానే సంపాదించవచ్చని జక్కన్న అంచనా వేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Rajamouli : మహేష్ మూవీపై రాజమౌళి భారీ ప్రణాళిక

    Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాకు...

    Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ ఏడాది క్రితమే మొదలైందా?

    Rajamouli : నటుడు పృథ్వీ రాజ్ తాజాగా ఒక మీడియా సమావేశంలో ఆసక్తికరమైన...

    Rajamouli : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళికి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…

    Rajamouli : దర్శకుడు రాజమౌళికి మహేష్ బాబు నటించిన సినిమాల్లో 'ఒక్కడు' మరియు...