YCP MLA : ఏపీలో పలు పండుగల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు గతంలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసేవారు. అయితే ఆ తర్వాత వార్త కథనాలు రావడం.. పలు విమర్శలు రావడంతో, రహస్యంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో, ఫామ్ హౌసులు, రహస్య ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. వీటికి తమ తమ పార్టీ వారికే మాత్రమే అనుమతినిస్తున్నారు. అయితే ఇటీవల ఈ రికార్డింగ్ డ్యాన్స్ ల ఏర్పాటు మరింత జోరందుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీల నాయకులు తరచూ ఈ రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఒక్కోసారి ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా డ్యాన్స్ చేసి, వీడియోలకు చిక్కారు. దీనిపై సదరు నాయకుల తీరును ఎండగడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
కాగా, తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం శివారులోని వ్యవసాయ క్షేత్రంలో కూడా ఓ కార్యక్రమం నిర్వహించారు. రికార్డింగ్ డ్యాన్స్ తరహాలో సాగింది. కొందరు నాయకులు తమ పదవులు మరిచి వేడుకలో యువతులతో చిందులేశారు. రికార్డింగ్ డ్యాన్స్ తరహాలో సాగింది. యువతులు ఈ కార్యక్రమంలో నృత్యం చేస్తుండగా, యర్రవరం సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు, హనుమాన్ ఆలయ ధర్మకర్త జీ గంగాధర్, జడ్పీటీసీ సభ్యురాలి భర్త, వైసీపీ నాయకుడు సిరికొండ సత్య నారాయణ, ఐటెం సాంగ్ లతో యువతులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ వీడియో చూసిన స్థానిక ప్రజలు తమ నాయకుల తీరుపై మండిపడుతున్నారు.అయితే ఇదంతా కామనే అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
ReplyForward
|