32.2 C
India
Monday, April 29, 2024
More

    AP YCP MLAs : టికెట్ కావాలంటే అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సిందే.. ఏపీలో వైసీపీ నేతలకు కొత్త కష్టాలు..!

    Date:

    AP YCP MLAs
    AP YCP MLAs

    AP YCP MLAs Faces Many Difficulties : 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున మళ్లీ టికెట్ కావాలంటే ఆ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిందే. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంతో పాటు వ్యక్తిగతంగా బూతులు తిట్టాలని వైసిపి పార్టీ పెద్దలు ఎమ్మెల్యే లకు కొత్త టాస్క్ ఇచ్చారు. ముఖ్యంగా చంద్రబా బు, పవన్ కల్యాణ్ లపై బూతులతో  విరుచుకు పడాలని..వారి కుటుంబాలని దూషించాలని నేరుగా చెబుతున్నారు.

    రాజకీయంగా చేసే విమర్శలు తనకు నచ్చవని.. వ్యక్తిగతంగా కించపరచాలని.. అప్పుడే తాను విశ్వసనీయమైన నేతగా భావి స్తానని సంకేతాలు  పంపుతున్నారు. టిక్కెట్ డౌట్ లో పెట్టి బూతుల పోటీ  చాలా మంది నేతలకు టిక్కెట్లు ఉండవని.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. ఇలా కంగారు పడి తమ దగ్గరకు వస్తున్న వారందరికీ.. సజ్జల నుంచి వస్తున్న మొదటి సూచన ఇదేనని  తెలుస్తోంది. మీ నియోజకవర్గాల్లో ప్రెస్మీట్లు పెట్టి బూతులు తిట్టాలని సూచిస్తున్నారు. చంద్రబాబు, పవన్ లపై ఎంతగా తిట్లతో విరుచుకుపడితే మీకు అంత ప్లస్ అవుతుందని చెబుతు న్నారు. వారిలో కొంత మంది తమకు ఇంత కంటే చాయిస్ లేదని నోరు విప్పుతున్నారు. కానీ చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు.

    టిక్కెట్ ఇవ్వకపోయినా ఇతర పార్టీల్లో చేరకుండా చేసే ప్లాన్ వైసీపీ నేతలకు బూతుల పోటీ లు పెట్టడం వెనుక సజ్జల  కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. అనుకోని పరిస్థితుల్లో టిక్కెట్లు టికెట్లు కేటాయించకపోయిన వారు జనసేన, టీడీపీల్లోకి వెళ్లకుండా.. ఆయా పార్టీల నేతలను వ్యక్తిగతంగా తిట్టిస్తున్నారని అంటున్నారు. పేర్ని నాని , రోజా, వల్లభనేని వంశీ, అమర్నాథ్ సహా ఎంతో మంది నేతలకు టిక్కెట్ ఇవ్వక పోయినా వారికి మరో దిక్కు లేదు. అంతగా నోరు పారేసుకున్నారు మరి. ఇలా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు… ఎంపీలకూ అదే ప్లాన్ చేస్తున్నారు.

     ప్రభుత్వం మారితే టార్గెట్ అవుతామని సైలెంట్ గా ఉంటున్న నేతలు రాజకీయా లను వ్యక్తిగత కక్షలుగా మార్చితే నష్టం జిగిపోతుందని పలువురు నాయకులు భావిస్తున్నారు.… ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో నివాసం ఉంటారో తెలియదని కానీ.. తాము మాత్రం చచ్చినట్లుగా ఏపీలో ఉండాలని ఎక్కువ మంది వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే… ఎన్నికలకు ముందు అయినా కాస్తంత సంయమనం పాటిస్తే… బెటరని అనుకుంటున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తాం కానీ వ్యక్తిగత దూషణలు చేయలేమని ఎక్కువ మంది తప్పుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    YCP 11th List : వైసీపీ 11వ జాబితా.. ‘గొల్లపల్లి’కి బంపరాఫర్

    YCP 11th List : వైసీపీ అభ్యర్థుల ప్రకటనను మరింత వేగవంతం...

    Kodali Nani : ఇవే నాకు చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన కొడాలి నాని..

    Kodali Nani : తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీమంత్రి కొడాలి నాని...