Kodali Nani : తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీమంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇప్పుడే స్పష్టం చేశారు. ప్రస్తు తం నా వయసు 53 సంవత్సరాలు అని మళ్లీ పోటీ చేసేసరికి నా వయస్సు 58 సంవత్సరాలు ఉంటుందని నా వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆయన తెలిపారు.
అందుకే 2029లో ఎన్నికలకు దూరంగా ఉంటానని కొడాలి నాని ప్రకటించారు. నా కూతుర్లకి రాజకీ యాలపై ఆసక్తి లేదని కొడాలి నాని తెలిపారు. నా తమ్ముడు కొడుక్కి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే అప్పుడు పోటీలో ఉండొచ్చని కొడాలి నాని తెలియజేశారు.
కొడాలి నాని అంటే తెలియని వారెవరు ఉండరు. మంత్రిగా పనిచేసిన ఆయన ప్రతిపక్ష నేతలపై ఎ ప్పటికప్పుడు విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి నుంచి జగన్ తప్పించి న నేపథ్యంలో కొడాలి నాని విమర్శలను తగ్గించేశారు.
అయితే తనకు ఈసారి టికెట్ కావాలని కచ్చి తంగా అడుగుతున్నట్లు ప్రస్తుతం ఆయన వ్యా ఖ్యలు చూస్తే అర్థమవుతుందని పొలిటికల్ సర్క్యూట్ లో జోరుగా చర్చ జరుగుతోంది.