Niharika Konidhela :
మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతో ఈ కుటుంబం నుండి ఎంత మంది హీరోలు వచ్చిన మెగా ఫ్యాన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. మరి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. ఈమెకు కూడా మెగా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. కానీ ఈమె హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది.. ఇక ఆ తర్వాత ఈమె పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది.
జొన్నలగడ్డ చైతన్యతో మెగా కుటుంబం నిహారికకు గ్రాండ్ గా పెళ్లి చేసారు. పెళ్లి తర్వాత ఈ జంట చాలా కాలం పాటు అన్యోన్యంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఈ భామ వీరి ఫోటోలను షేర్ చేస్తూ ఆనందంగా జీవిస్తుండడంతో ఈమె కెరీర్ లో సక్సెస్ కాలేక పోయిన లైఫ్ లో అయితే ఫుల్ ఖుషీగా ఉంది అని అంతా భావించారు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జంట విడాకులు తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఇవి రూమర్స్ అనుకున్న కూడా మొన్న జరిగిన వరుణ్ ఎంగేజ్మెంట్ లో కూడా చైతన్య కనిపించక పోవడంతో వీరి విడాకులు కన్ఫర్మ్ అయిపోయినట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు. అయినప్పటికీ ఎటువంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
ఇక ఇప్పుడు మరోసారి నిహారిక వార్తల్లో నిలిచింది. ఈమె మరో పెళ్లి చేసుకోబోతుంది అంటూ టాక్ వస్తుంది.. ఈమె రెండవ పెళ్లి చేసుకుంటుంది అని అది కూడా యూట్యూబర్ అని టాక్.. తనకు మంచి ఫ్రెండ్ అని నిహారికకు బాగా క్లోజ్ గా ఉండే ఆ వ్యక్తితోనే ఈమె పెళ్లి జరగబోతుంది అని అప్పుడే పెళ్ళికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఇవి నిజమో కాదో తెలియదు కానీ ఈ రూమర్స్ పై నిహారిక స్పందిస్తే తప్ప ఆగేలా లేవు..