Niharika second marriage : మెగా ఫ్యామిలీ ఆడ పిల్లలకు వివాహాలు కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూతుళ్ల కాపురాలు ఇబ్బందుల్లో పడగా రీసెంట్ గా వివాహం చేసుకున్న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కాపురం కూడా పటా పంచలైంది. కొన్ని రోజులకే ఈ జంట మ్యూచివల్ డైవర్స్ తీసుకుంది. నిహారిక తన ఇన్ స్టాలో తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య పిక్ తొలగించినప్పటి నుంచి విషయం బయటకు పొక్కగా విడాకులు కూడా తీసుకుంది.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక మాత్రమే వచ్చింది. చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నా వారు నటన వైపు రాలేదు. ఈ మధ్యనే తన పెద్ద కూతురు ప్రొడక్షన్ హౌజ్ పెట్టగా చిరంజీవి ఒక సినిమా కూడా చేయనున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూతురు సినిమాలకు రావడం హీరోయిన్ గా కూడా చేయడం ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్ గా వివాహం జరగడం, తరువాత విడిపోవడం. అన్నీ మనకు తెలిసిందే. అయితే ఇటీవల మరో వార్త టాలీవుడ్ సర్కిల్, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ లోని ఒక వ్యక్తిని నిహారిక కొన్ని రోజులుగా ప్రేమిస్తుందట. అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. తన లవ్ మ్యాటర్ తండ్రి నాగబాబుకు కూడా చెప్పిందట. రెండో పెళ్లి చేసుకుంటే.. అని నాగబాబు చాలా కండీషన్లు పెట్టారట. ఫస్ట్ మ్యారేజ్ లో జరిగిన తప్పులను సెకండ్ మ్యారేజ్ లో చేయద్దని, భార్య, భర్తలు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని, ఇంకా ఇలా చాలా కండీషన్లు పెట్టాడట. తనకు నమ్మకం కలిగిస్తేనే మ్యారేజ్ కు ఒప్పుకుంటానని చెప్పారట. ఇక నిహారిక సమాధానం చెప్పిన తర్వాత రెండో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.