Janasena : జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో.. దాదాపు సీట్ల సర్దుబాటు ఖరారయిందని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు వెల్లడించారు. ‘పవన్, చంద్రబాబు మధ్య అవగాహన కుదిరింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న వైసీపీని గద్దె దించాలని ఇరువురూ నిర్ణయించారు.
ఈ పొత్తును వైసీపీ నాయకులు తట్టుకోలే కపో తున్నారు. ఆ పార్టీకి చెందిన సోషల్‌మీడియా, పేటీఎం బ్యాచ్‌లు కుట్రలకు పాల్పడుతున్నాయి. సీట్లు సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చేసింది. కొద్దిరోజుల్లో జాబితా వెల్లడవుతుంది. కచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు.