
Urvashi Rautela : మిస్ దివా యూనివర్స్-2015 విన్నర్ గా నిలిచి బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా సూపర్ హిట్ సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న నటి, మోడల్ ఊర్వశి రౌతుల. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ అనే పాటలో చిరంజీవి తో కలిసి స్టెప్పులేసింది. ఈ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన ‘ఏజెంట్ లో సూపర్ హిట్ సాంగ్ ‘వైల్డ్ సాలే’లో కూడా ఆడిపాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘బ్రో’ మూవీ లో ఒక ఐటెం సాంగ్ చేస్తుంది.
అయితే, ఈ పాట కోసం ఆమె మూడు రోజుల కాల్ షీట్స్ ఇచ్చిందట. ఈ మూడు రోజులకు ఆమె రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పాట నిడివికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ వసూలు చేయాలని అనుకుంటుందట. మూడు నిమిషాలు పాటైతే రూ. 3 కోట్లు ఇవ్వాల్సిందేనట. అలా ఒక పాటలో ఎన్ని నిమిషాలు కనిపిస్తే అన్ని కోట్ల డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఈమె రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ తరహా పారితోషికం స్టార్ హీరోయిన్లు కూడా తీసుకోరట. అయితే ఈ ఘటనతో ప్రొడ్యూసర్లు ఈమె పేరు చెప్తేనే జంకుతున్నారట. కేవలం ఐటెం సాంగ్ కు హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం బహూషా ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఒక రేంజ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ అయితే కూడా ఇంత తీసుకోదు. కానీ ఐటం సాంగ్ చేసే ఊర్వశి ఇంతలా డిమాండ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఎంత అందంగా ఉంటే ఏందిరా సామి.. డబ్బులు మాత్రం బాగానే గుంజుతుందని ఇండస్ట్రీ మొత్తం చెవులు కరుక్కుటుంది.