Urvashi Rautela :
ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ భామ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే మెరిసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతుంది.. 2013 నుండి బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుని ఇప్పటికి రాణిస్తుంది.
టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు వరుసగా ఆఫర్స్ వరిస్తున్నాయి.. ఇప్పటికే మెగా హీరోల సినిమాల్లో ఆడిపాడి మెగా ఫ్యాన్స్ కు దగ్గర అయిన ఈ బ్యూటీ తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ భామ తాజాగా తన పెళ్లిపై చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఊర్వశి రౌటేలా రీసెంట్ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి.. పెండ్లి హడావిడి అంటే నాకు చాలా ఇష్టం.. మరీ ఇంత ఫాంటసీ ఏంటి అని అనుకోక పోతే నాకు 7 రకాలుగా పెళ్లి చేసుకోవాలని ఉంది.. బీచ్, థీమ్ బేస్డ్, క్రూజ్, క్రిస్తవ, హిందూ, బెంగాలీ, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ 7 రకాలుగా పెళ్లి చేసుకోవాలని ఉంది.
పెళ్లిని బాగా ఆస్వాదించాలని ఉంది. అయితే సరైన జోడీని వెతుక్కోవడం కష్టమే.. ఎందుకంటే నేను లైఫ్ పార్ట్నర్ లో చాలా క్వాలిటీస్ కావాలని అనుకుంటున్నాను.. అందమే కాదు తెలివి, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే అవగాహనా, మంచి వ్యక్తిత్వం వంటివి కోరుకుంటాను.. అలాంటి వాడే నావాడు అంటూ ఈమె చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వరుడు ఎక్కడ దొరుకుతాడో చూడాలి.