32.6 C
India
Saturday, May 18, 2024
More

    Germany : జర్మనీ వెళ్లాలనుకునే వారికి ఇక  షెంజెన్‌ వీసా

    Date:

    Germany visa
    Germany visa

    Germany :  ఈ రోజుల్లో చాలా మంది విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. తమ భవిష్యత్ కోసం ఇతర దేశాలకు వలస వెళ్లి బాగా సంపాదించాలని కలలు కంటున్నారు. ఈనేపథ్యంలో అమెరికా, కెనడా, ఇంగ్లండ్, జర్మనీ వంటి దేశాలకు తరచుగా వెళ్తున్నారు. అక్కడకు వెళ్లాలంటే మొదట మనకు కావాల్సింది వీసా. వీసా ఉంటేనే సంబంధిత దేశాలకు మనం వెళ్లొచ్చు. లేదంటే కుదరదు. అందుకే వీసా ముఖ్యమైనది.

    భారతీయుల కోసం జర్మనీ జారీ చేస్తున్న షెంజెన్ వీసాల ప్రక్రియ సమయం ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్ వైలర్ పేర్కొన్నారు. భారతీయులు చాలా మంది జర్మనీ దేశానికి రావడానికి ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో వీసా గడువును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ గడువు ఇంకా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    భారతీయులు పెట్టుకునే వీసా దరఖాస్తులను బట్టి సమయాన్ని తగ్గిస్తున్నారు. అందుకే జర్మనీ వెళ్లాలనుకునే వారికి ఇది శుభ వార్తగా చెప్పొచ్చు. ఇన్నాళ్లు అక్కడికి వెళ్లాలంటే చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. జర్మనీ వెళ్లాలనుకునే వారికి వీసా గడువు మరింత తగ్గనుండటంతో ఇక మీదట వేచి చూడాల్సిన అవసరం రాదని తెలుస్తోంది.

    ముంబయిలోని జర్మనీ రాయబార కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను పెంచారు. దీంతో వీసాల గడువు తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీసా కోసం వేచి చూసే సమయం తగ్గించడంతో చాలా మంది జర్మనీకి వెళ్లేందుకు మొగ్గు చూపుతారని ఆశిస్తున్నారు. దీంతో భారతీయులకు మరింత ఆసక్తి పెరుగుతుందని జార్జ్ చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    Double Decker Airplane Seats : జర్మనీలో డబుల్ డెక్కర్ ఎయిర్ ప్లేన్ సీట్ల తీరు వివాదాస్పదం

    Double Decker Airplane Seats : జర్మనీలో తయారు చేసిన డబుల్...

    Cough Medicines : దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..

    Cough Medicines : విదేశాలకు ఎగుమతి చేసే దగ్గు మందులపై కేంద్రం...