
Cough Medicines : విదేశాలకు ఎగుమతి చేసే దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలు తయారు చేస్తున్న మందుల కారణంగా విదేశాల్లో మరణాలు చోటు చేసుకోవడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది..
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న దగ్గు మందులు (cough medicines) వాడి 2022లో గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా తదితర దేశాల్లో పలువురు చిన్నారులు మ`తి చెందారు. దీనిపై డబ్ల్యూహెచ్వో సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నే కేంద్రం అప్రమత్తమైంది. ఇక దగ్గమందుల నాణ్యతపై రాజీ ఉండదని ప్రకటించింది. ఇకపై నాణ్యతా ప్రమాణాల తనిఖీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు మన దేశం నుంచి పెద్ద ఎత్తున దగ్గు మందులు ఎగుమరి అవుతుంటాయి.