36.9 C
India
Tuesday, April 21, 2026
More

    50మంది సిట్టింగ్‌ల‌కు సీట్లు క‌ష్ట‌మే.. కేసీఆర్ కీలక నిర్ణ‌యం..!

    Date:

    The Telangana High Court gave a shock to the KCR government
    KCR
    కేసీఆర్ డిఫెన్స్‌లో ప‌డ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. ఇప్పుడున్న‌ ఎమ్మెల్యేల‌పై ప‌బ్లిక్‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డం ఆయ‌నను టెన్ష‌న్‌కు గురి చేస్తోంది. చాలా మంది బీఆర్ఎస్ శాస‌న స‌భ్యులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో దందాల్లో ఆరితేర‌డంతో.. ప్ర‌జ‌ల్లో వారి ప‌ట్ల నెగ‌టివ్ వైబ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. అనేక మంది ఎమ్మెల్యేల‌పై భూ క‌బ్జా,దందాలు, సెటిల్‌మెంట్ల ఆరోప‌ణ‌లున్నాయి.

    ఎమ్మెల్యేల అవినీతిని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా మెయిన్ స్ట్రీం మీడియాను సీఎం కేసీఆర్ కంట్రోల్ చేయ‌గ‌ల్గుతున్నారు. అయితే మెయిల్ స్ట్రీం మీడియాను దాదాపు అదుపులో పెట్టిన‌ప్ప‌టికీ..సోష‌ల్ మీడియాను నియంత్రించ‌డం కేసీఆర్ వ‌ల్ల కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయా సెగ్మెంట్ల వారిగా శాస‌న స‌భ్యులు చేసిన ఘ‌న‌కార్యాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇలా వ‌చ్చిన వీడియో లు,కంటెంట్ ప‌బ్లిక్‌లోకి విస్తృతంగా వెళుతోంది. దీంతో అధికార పార్టీ శాస‌న స‌భ్యులు చేసిన లీల‌లు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఫ‌లితంగా ఎమ్మెల్యేల‌పై ప‌బ్లిక్‌లో వ్య‌తిరేక‌త బాగా పెరిగింది.

    ఈ నేప‌థ్యంలోనే స‌ద‌రు ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేకాక ప‌బ్లిక్‌లో వ్య‌తిరేక‌త ఉన్న శాస‌న స‌భ్యుల‌పై ఆయ‌న ప్ర‌త్యేక నిఘా పెట్టారు. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు. అయితే ఆయ‌న తెప్పించుకున్న నిఘా వ‌ర్గాల నివేదిక‌ల్లో సుమారు 50 మంది ఎమ్మెల్యేలపై ప‌బ్లిక్‌లో బాగా వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు తేలింది. దీంతో వారికి రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున టికెట్ ఇస్తే త‌న పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌నే నిర్ణ‌యానికి కేసీఆర్ వ‌చ్చిన‌ట్లు టాక్.

    అందులో భాగంగానే గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్లో స‌ద‌రు శాస‌న స‌భ్యుల‌కు పార్టీ త‌ర‌పున బీ-ఫామ్స్ ఇవ్వ‌బోమ‌నే సంకేతాల‌ను పంపించారు కేసీఆర్. అయితే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితుల్లో మార్పులుంటే మాత్రం త‌న నిర్ణ‌యంలో కూడా మార్పులుండొచ్చ‌ని చెప్పారంటా..! మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన ఇండికెష‌న్స్‌తో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలంద‌రికీ మాత్రం టికెట్లు రాక‌పోవ‌చ్చ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth Reddy in KCR Sabha : కేసీఆర్ సభలో రేవంత్ రెడ్డి.. వైరల్ వీడియో

    Revanth Reddy in KCR Sabha : తెలంగాణలో ఎన్నికల కోలాహలం...

    KCR cabinet : ఆ అంశాలపై చర్చించిన కేసీఆర్ కేబినేట్.. కర్ణాటక ఎన్నికలపై ఆరా తీసిన బాస్..

    రాష్ట్ర మంత్రివర్గం గురువారం (మే 18) రోజున సమావేశం కానుంది. డాక్టర్...

    CM KCR Meeting : రేపు కేసీఆర్ ఎమెర్జన్సీ మీటింగ్ .. అందుకేనా..?

    CM KCR meeting: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ లో కలవరం...