37.8 C
India
Saturday, May 18, 2024
More

    Shahrukh Dupe Remuneration : షారుఖ్ డూప్ రెమ్యూనరేషనే అంతనా..!

    Date:

    Shahrukh Dupe Remuneration
    Shahrukh Dupe Remuneration

    Shahrukh Dupe Remuneration : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు నార్త్.. సౌత్ అనే తేడా లేకుండా అంతటా అభిమానులున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆయన సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. ఏ పెద్ద హీరోలకైనా కొన్ని యాక్షన్ మరియు రిస్కీ సీన్లలో డూప్ నటించడం కామన్. ఈ విషయం సినిమాలు చూసే వారందరికీ తెల్సిందే. అయితే షారుక్ కు ఓ వ్యక్తి 15ఏళ్లుగా డూప్ గా నటిస్తున్నాడు.

    షారుఖ్ తాజా చిత్రం ‘జవాన్’లోనూ ఆయన డూప్ నటించారు. ఈ మూవీలో షారుఖ్ డ్యూయల్లో భాగంగా తండ్రి.. కొడుకులుగా కన్పించాడు. రియల్ షారుఖ్ ఈ మూవీలో కొడుకుగా నటిస్తే.. ఆయన డూప్ తండ్రిగా నటించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తే ప్రశాంత్ వాల్దే. ఈయన గత 15ఏళ్లు షారుఖ్ డూప్ గా నటిస్తుండటం గమనార్హం.

    ప్రశాంత్ వాల్దే డూప్ గా నటిస్తున్నప్పటికీ ఆయన రైటర్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్ గాను సినిమాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జవాన్ సినిమాలో ఓ సీన్లో తండ్రిని కొడుకు హగ్ చేసుకునే సన్నివేశం ఉంటుందని చెప్పాడు.

    అది చేసేటప్పుడు షారుక్ కొడుకు గెటప్ వేస్తే తాను తండ్రి గెటప్ వేశానని చెప్పాడు. నేను కొడుకు గెటప్ వేస్తే షారుఖ్ తండ్రి గెటప్ సీన్స్ చేశారని.. ఇలా తాము వేర్వేరు గెటప్స్ వేయాల్సి వచ్చిందని ప్రశాంత్ తెలిపాడు. ఇకపోతే షారుఖ్ డూప్ గా నటిస్తున్న ప్రశాంత్ రోజుకు 30వేల పారితోషికం తీసుకుంటాడట.

    ఈ లెక్కన నెలకు ఆయన సంపాదన 9లక్షలు. సినిమా మొత్తంలో తనకు 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుతుందట. ఒక డూప్ సంపాదన ఓ మీడియం రేంజ్ హీరో రెమ్యూనేషన్ కు సమానంగా ఉండటంతో సినీప్రియులు షాక్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Shahrukh Khan Birthday Special : బర్త్ డే స్పెషల్ : బాలీవుడ్ కు దొరికిన ఆణిముత్యం షారూఖ్ ఖాన్

    Shahrukh Khan Birthday Special : బాలీవుడ్ బాద్ షా షారూఖ్...

    Jawaan Records : ఆ రికార్డ్ సృష్టించిన ‘జవాన్’.. ఏకైక స్టార్ హీరో కింగ్ ఖానే..!

    Jawaan Records : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.....

    Aryan Khan: షారుక్ ఖాన్ తనయుడి డ్రగ్స్ కేసులో కీలక మలుపు

    Aryan Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్...